టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఈ పేరు వినగానే వెంటనే కాంట్రవర్సీలు, కాస్టింగ్ కౌచ్, అర్థనగ్న ప్రదర్శనలు ఇలా ఎన్నో గుర్తుకు వస్తుంటాయి. ఒక్క సంవత్సరంలో టాలీవుడ్ లో ఎన్నో బీభత్సాలు సృష్టించిన ఈ అమ్మడు ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. అయినా కూడా తెలుగు సినీ పరిశ్రమను  ఏ మాత్రం విడవడం లేదు.  ప్రతి చిన్న సమస్యపై స్పందిస్తూ తనదైన వ్యంగాస్త్రాలను వదులుతూనే ఉంది.  తాజాగా నిన్న ‘మా’ అసోసియేషన్ గొడవపై శ్రీరెడ్డి తనదైన సెటైర్లు వేసింది. గతంలో  ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి పేరు జాతీయస్థాయిలోనూ మారుమోగిన విషయం తెలిసిందే.

అలాంటి మా అసోసియేషన్ లో జరుగుతున్న ముసలం పై ఈమె తనదైన కామెంట్స్ చేస్తూ వస్తుంది. మా” (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) లో జరుగుతున్నటువంటి వివాదంపై సంచలన వ్యాఖ్య‌లు త‌న‌దైన శైలిలో చేసింది.  నరేష్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్... సగం గోసి మా మెంబర్స్ లాగేశారు… అంటూ అసభ్య పదజాలంతో పోస్టు పెట్టింది. అంతే కాదు భవష్యత్ లో మా అసోసియేషన్ సభ్యులు సఖ్యతగా ఉంటారా..? ఈ గొడవలకు అంతే లేదా అన్న రీతిలో శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తుంది. 

కాగా, మొన్న ఆదివారం ‘మా’ సభ్యుల మీటింగ్ లో అధ్యక్షుడైన నరేషన్ ని పిలవకపోవడం..ఆయన వీరిపై ఆరోపణలు చేయడం..దానికి కౌంటర్ గా జీవిత, హేమ లు దారుణంగా కౌంటర్ వేయడంతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నరేష్, జీవిత రాజశేఖర్ మధ్య జరుగుతున్న వివాదంపై శ్రీరెడ్డి అసభ్యకరంగా స్పందించడం కొత్తేం కాద‌ని లైట్ తీస్కో అంటున్నారు సినీ జ‌నాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: