బిగ్ బాస్ అయిపోవడానికి మరికొంత సమయమే ఉంది. ఈ వారమే చివరి ఎలిమినేషన్ జరగనుంది. చివరి వారంలో హౌస్ నుండి ఎవరు వెళ్ళిపోతారనేది చాలా ఆసక్తికరంగా మారింది. గురువారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న వారికి టాస్క్ లు జరిగాయి. వీరందరూ టాస్క్ లు బాగా ఆడి ప్రేక్షకుల నుండొ ఓట్లు పొందాలని బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో అందరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ మూడు పొరపాట్లు చేసినట్లు తెలుస్తుంది.


మొదటగా టికెట్ టు ఫినాలే కోసం సులువైన టాస్క్ లు  ఆడించిన బిగ్ బాస్ అభిమానుల ఓట్లు పొందడానికి మాత్రం కష్టమైన టాస్క్ లు ఇచ్చాడు. ఇవే టాస్క్ లు టికెట్ టు ఫినాలేలో ఇచ్చి ఉంతే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక రెండోది, వరుణ్ చేసిన టాస్క్ లో ఐదు అవకాశాలు ఇచ్చిన బిగ్ బాస్, బాబా భాస్కర్ చేసిన టాస్క్ కి ఒక్క అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. అంటే టాస్క్ లలో సమతుల్యత లోపించిందని అర్థం అవుతుంది.


మూడోది, వరుణ్ టాస్క్ మధ్యలో వరుణ్ రాడ్ ని కింద పెట్టేస్తాడు. మరి  కింద పెడితే టాస్క్ అయిపోయినట్టా, కాదా లేక అది కూడా ఒక అవకాశంగా భావించాలా అనేది ఎవరికీ అర్థం కాదు. ఈ విషయంలో బిగ్ బాస్ ఏమీ చెప్పకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇక శివజ్యోతికి ఇచ్చిన టాస్క్ లో పాలలో గుడ్లు కలుపుని తాగమన్నారు. కానీ ఎంత సమయానికి ఎన్ని గుడ్లు తాగాలనే విషయం మాత్రం చెప్పలేదు. అటువంటప్పుడు ఒకే గుడ్డును ఎంత సేపటి వరకైనా తాగవచ్చు. ఈ విధంగా టాస్క్ లు బాగున్నప్పటికీ, పైన చెప్పిన లోపాలు లేకుండా బాగుండేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: