టాలీవుడ్ ఇండస్ట్రీలో 'లక్ష్మీ కళ్యాణం' సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించి సౌత్ ఇండస్ట్రీలోనే ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామని భావించి సౌత్ సినిమాల విషయంలో చిన్న చూపు చూసిన కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన విజయాలు దక్కకపోవడంతో లైఫ్ ఇచ్చిన సౌత్ వైపే తిరిగి చూసి ప్రస్తుతం కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో సినిమాలు చేస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.


ఈ నేపథ్యంలో ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యాడ్స్ రంగంలో కూడా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ తాజాగా ఆన్ లైన్ లో పేకాట కి సంబంధించిన రమ్మీ, కార్డ్ గేమ్స్ ని ఆడాలని కాజల్ అగర్వాల్  అడ్వటైజ్మెంట్ చేసే అవకాశం రావడంతో దానికి కాజల్ అగర్వాల్ ఒప్పుకోవడం తో ఆమె పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. కారణం ఏమిటంటే ఆన్ లైన్ రమ్మీ, కార్డ్ గేమ్స్ ని ఇండియాలోని మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణాలో కూడా నిషేధించారు.


ఆన్ లైన్ లోఇటువంటి గేమ్ లు ఆడడం వలన చాలా మంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారని తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది స్కిల్ గేమ్ అంటూ సదరు ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లు కోర్టులో పోరాడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎంతో మంది జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ఇటువంటి పేకాట ఆటలకు మంచి క్రేజ్ కలిగిన కాజల్ అగర్వాల్ ప్రచార బాధ్యతలు చేపట్టడం దారుణమని...కాజల్ అగర్వాల్ ఈ యాడ్ చేయకూడదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: