రానా దగ్గుబాటి ఆరోగ్యం పై కొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మొన్నటికి మొన్న సురేష్ బాబు మాత్రం తన కొడుకుకి ఏం కాలేదని.. కేవలం కంటి సమస్య మాత్రమే ఉందని కన్ఫర్మ్ చేసాడు. దానికి తోడు కొన్ని రోజులుగా రానా ఇండియాలో లేకపోవడం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. ఈ మధ్యే మళ్లీ ఇండియాకు వచ్చాడు రానా దగ్గుబాటి. వచ్చిన వెంటనే ముంబైలోనే కొన్ని రోజులు ఉన్నాడు. ఈ మధ్యే రాజమౌళి అండ్ టీంతో కలిసి బాహుబలి ప్రివ్యూ షో కోసం జపాన్, లండన్ వెళ్లాడు. ఇవన్నీ ఒకెత్తయితే కొంతకాలంగా రానా అనారోగ్యంతో ఉన్నాడని వార్తలొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటిపై రానా క్లారిటీ ఇచ్చాడు. నాకు సంబంధించిన విష‌యం ఏదైనా స‌రే నేను చెప్పేదే క‌రెక్ట్ వేరే వాటిని న‌మ్మ‌కండి అని ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. 


 కార్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. ఆల్రైట్.. ఆన్‌లైన్‌లోకి లోకి వచ్చాను.. మరికొన్ని గంటల్లో ఇండియాలో వస్తున్నానంటూ పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడు తన ట్విట్టర్లో మరో సంచలన పోస్ట్ పెట్టాడు.  తన గురించి తాను కాకుండా వేరే ఎవరూ పోస్ట్ చేసినా.. వార్తలు రాసినా అది అబద్ధమే అని క్లారిటీ ఇచ్చాడు రానా. దాంతో రానా అనారోగ్యంపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈయన వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. రానా కోసమే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. హిందీలో హౌజ్ ఫుల్ 4 సినిమాను ఇప్పటికే పూర్తి చేసాడు రానా. మొత్తానికి ఈయన ట్వీట్‌తో అభిమానులకు కాస్త ఊరట లభించింది. రానా దగ్గుబాటి ఆరోగ్యం పై కొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మొన్నటికి మొన్న సురేష్ బాబు మాత్రం తన కొడుకుకి ఏం కాలేదని.. కేవలం కంటి సమస్య మాత్రమే ఉందని కన్ఫర్మ్ చేసాడు. దానికి తోడు కొన్ని రోజులుగా రానా ఇండియాలో లేకపోవడం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. ఈ మధ్యే మళ్లీ ఇండియాకు వచ్చాడు రానా దగ్గుబాటి. వచ్చిన వెంటనే ముంబైలోనే కొన్ని రోజులు ఉన్నాడు. ఈ మధ్యే రాజమౌళి అండ్ టీంతో కలిసి బాహుబలి ప్రివ్యూ షో కోసం జపాన్, లండన్ వెళ్లాడు. ఇవన్నీ ఒకెత్తయితే కొంతకాలంగా రానా అనారోగ్యంతో ఉన్నాడని వార్తలొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటిపై రానా క్లారిటీ ఇచ్చాడు. నాకు సంబంధించిన విష‌యం ఏదైనా స‌రే నేను చెప్పేదే క‌రెక్ట్ వేరే వాటిని న‌మ్మ‌కండి అని ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. 


 కార్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. ఆల్రైట్.. ఆన్‌లైన్‌లోకి లోకి వచ్చాను.. మరికొన్ని గంటల్లో ఇండియాలో వస్తున్నానంటూ పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడు తన ట్విట్టర్లో మరో సంచలన పోస్ట్ పెట్టాడు. తన గురించి తాను కాకుండా వేరే ఎవరూ పోస్ట్ చేసినా.. వార్తలు రాసినా అది అబద్ధమే అని క్లారిటీ ఇచ్చాడు రానా. దాంతో రానా అనారోగ్యంపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈయన వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. రానా కోసమే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. హిందీలో హౌజ్ ఫుల్ 4 సినిమాను ఇప్పటికే పూర్తి చేసాడు రానా. మొత్తానికి ఈయన ట్వీట్‌తో అభిమానులకు కాస్త ఊరట లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: