అమ్మాయిల కళల రాకుమారుడు అంటే వెంటనే వినపడే పేరు మహేష్.. ఈ పేరులో ఎదో వైబ్రేషన్ ఉంది.. అంటూ అమ్మాయిలో మహేష్ కోసం క్యూలు కడుతున్నారు.. మహేష్ అంటే పిచ్చి అంటూ హీరోయిన్లు సైతం ఆయనకోసం పది చచ్చిపోతుంటారంతే.. మహేష్ అందం అలాంటిది మరి.. ఎక్కడ తప్పు ఎవరిదీ కాదు అయితే మహేష్ బాబుకు పెళ్లి అవ్వడంతో చాలా మంది పాపం కొద్దీ రోజులు నిద్రాహారాలు మానేశారు అంటే నమ్మండి. 


ఇకపోతే మహేష్ సినిమా పట్ల ఎంత శ్రద్దగా ఉంటారో కుటుంబం విషయంలో కూడా అంటే శ్రద్ద తీసుకుంటారన్న  విషయం అందరికి తెలుసు. సినిమా షూటింగ్ మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా భార్యాపిల్లలతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు మాహేష్. అలాంటి మహేష్ తోలి సరిగా ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్ చేశారు. అందుకు సంబదించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మహేష్ సినిమాలతో పాటుగా.. వాణిజ్య ప్రకటనతో కూడా బాగా చేస్తుంటాడు. అయన ఏ యాడ్ చేస్తే అది సూపర్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. అలా చాలా ప్రకటనలు చేసాడు మహేష్. ఎప్పుడు ఒంటరిగా చేసే మహేష్ ఇప్పుడేమో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటనలో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార కూడా భాగస్వాములు కావడం సూపర్ స్టార్ అభిమానులను కనువిందు చేస్తోంది. 


ఆ వీడియో లో.. ఏముందంటే..  ''మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్ చేశారు. కానీ నేను కూడా మీలో ఒకడినే. మీ అందరి లాగే నాకు కూడా నా ఫ్యామిలీయే నా లైఫ్ లైన్. నా ఇల్లే నా ప్రపంచం. నా వాళ్ళనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా..'' మహేష్ మాట్లాడుతున్న తీరు ఫిదా చేస్తోంది. మహేష్ సహా నమ్రత, గౌతమ్, సితార అలా నడుస్తూ వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ వీడియో ను మీరు చుడండి.. 


https://www.youtube.com/embed/Lex7ThK2r6E

మరింత సమాచారం తెలుసుకోండి: