సమరసింహా రెడ్డి., నరసింహ నాయుడు., చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో క్లాస్., మాస్ తేడా లేకుండా ప్రతొక్కరి ప్రశంసలు అందుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్న వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం బాలయ్య ఎన్నడూ లేనిది సిక్స్ ప్యాక్ తో స్టయిలిష్ లుక్ లో సరికొత్తగా కనిపించనున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య బాబు లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీపావళి కానుకగా అభిమానులకు మరో నవీకరణ ఇస్తారట. 

 

 

సినిమా పేరును చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిక పోయినా కూడా జెమినీ ఛానెల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుగోలు చేశారు.. ఈ సందర్భంగా ఈ సినిమా పేరును 'రూలర్' గా ప్రకటించారు.. అయితే దీపావళి కానుకగా బాలయ్య బాబు అభిమానులకు ఈ చిత్ర యూనిట్ ‘రూలర్’ టైటిల్‌‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారట.. సినిమాలు., సినీ వేదిక., అసెంబ్లీ లలో బాలక్రిష్ణ ప్రదర్శించే రాజాశం చూసి ఈ సినిమాకు ఆ పేరు ఎంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే మన రాయల్ 'రూలర్' సినిమా ముచ్చట్లను ఇప్పుడు మనం చూసేద్దాం..

 

 

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేదాని మీద సినిమా సాగనుంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న థియేటర్ లలో నిలిపే ప్రయత్నంలో ఉన్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించనున్నారు.. ఖుషీ ఫేమ్ భూమిక ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారట.. ఒకప్పుడు చిరంజీవి నటించిన 'రుస్తుం' సినిమాల ఇప్పుడు బాలక్రిష్ణ తీయబోతున్న 'రూలర్' ఘన విజయం సాధించాలని మనమంతా ఆశిద్దాం..!! పైరసీని అరికట్టేందుకు బాలక్రిష్ణ అభిమానులుగా తోడ్పడదాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: