మోడరన్ కల్చర్ అదేవిధంగా పబ్బుల కల్చర్ పెరిగి పోవడంతో సెలిబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా మద్యంమత్తులో వీరంగాలు సృష్టించే సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయాయి. ఇదివరకు బాలీవుడ్ లో మాత్రమే బహిరంగంగా కనిపించే ఈకల్చర్ ఇప్పుడుమన టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ లకు కూడా సోకింది.  దీనికి కొనసాగింపుగా ఈ మధ్య బెంగుళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, కన్నడ నటి మాధురి, మరికొందరు స్నేహితులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనతో స్థానికులు విస్తుపోయారు. బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రమేష్ దిమ్లా, మాధురితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు అని వార్తలు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరు పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఉదయం మల్లేశ్వరం ప్రాంతంలో 17వ క్రాస్ వద్దకు లగ్జరీకారు నెం. KA 05 NK 7275లో చేరుకున్న వీరు నడిరోడ్డుపై నిల్చుని బీర్లు తాగారట. అంతే కాదు నటి మాధురితో పాటు యువతులు అసభ్యంగా అర్థనగ్న దుస్తులు వేసుకుని హడావిడి చేసారట.  వీరంతా రోడ్డుపై వీరు మద్యం తాగుతూ, అర్ధనగ్న దుస్తువులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో. ఈ గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సినిమా సెలిబ్రిటీలను అదుపులోకి తీసుకున్నారని టాక్. ఏది ఏమైనా ఈ విషసంస్కృతి మన దక్షణాది సినిమా రంగాన్ని కూడా తాకటం దురదృష్టం అని అంటున్నారు విశ్లేషకులు.   

మరింత సమాచారం తెలుసుకోండి: