పెళ్ళి చూపులు సినిమా ద్వారా బాగా పేరు పొందిన నటుడు ప్రియదర్శి. ఆ సినిమాలో ప్రియదర్శి చేసిన కామెడీకి చాలా మంచి పేరొచ్చింది. ప్రియదర్శి లాగే ఒకే సినిమాతో ఫేమస్ అయిన నటుడు రాహుల్ రామక్రిష్ణ. అర్జున్ రెడ్డి సినిమాలో శివ క్యారెక్టర్ అతన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. అయితే వీరిద్దరూ మరో హీరోతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఇద్దరు కమెడియన్లు ఒక హీరోతో సినిమా చేయడం విచిత్రమే.


అయితే వీరిద్దరూ ఇంతకుముందు ఇలాంటి ప్రయోగం చేసినవారే. బ్రోచేవారెవరురా సినిమా వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే బ్రోచేవారెవరురా సినిమాలో వీరితో పాటు శ్రీ విష్ణు, సత్యదేవ్ కూడా నటించారు. ప్రస్తుతం వీరిద్దరితో కలిసి మొన్ననే ఏజెంట్ సాయి శ్రీనివాస సినిమాతో హీరోగా హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి "జాతి రత్నాలు" అనే సినిమాలో నటిస్తున్నాడు.


సినిమా ఆల్రెడీ డెబ్భై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో మహానటి చిత్ర దర్శకుడు మొదటిసారిగా నిర్మాతగా మారబోతున్నాడు.కాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. 420, 210,840 నంబర్లు కలిగిన ఖైదీ దుస్తులు ధరించి ఉన్న నవీన్, ప్రియదర్శి, రాహుల్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హిలేరియస్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.


ఇక ఈ చిత్రానికి అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తుండగా, స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మితం అవుతుంది. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. మహానటి సినిమా ద్వారా జాతీయ స్థాయిలో కీర్తి పతాకం ఎగరవేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరెకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: