కమెడియన్ హేమ చేసే కామెడి కే కాదు ఆమె చేసే కాంట్రవర్సీ కి సైతం అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. అయితే హేమా ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ మీద కాంట్రవర్సీ చేశారు.. గత కొన్నేళ్లుగా 'మా' అసోసియేషన్‌లో విభేదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం ‘మా’ అధ్యక్షుడు లేకుండానే జనరల్ సెక్రటరీ జీవిత, ఎగ్జిక్యూటివ్ మెంటర్లు కలిసి నిర్వహించిన సమావేశం పై ఆగ్రహించిన నరేష్ తన ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించారని., అంతేకాక ఈ సమావేశంపై తాను లీగల్ చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పాడు. నరేష్ వ్యాఖ్యలపై జీవిత, హేమ, జయలక్ష్మి స్పందిచారు. 

 

అంతకు ముందు శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న టైంలో జనరల్ సెక్రటరీ హోదాలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు అన్న హేమ వ్యాఖ్యలపై జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకునే అధికారం తనకుందని చెప్పారు నరేష్. అయితే ఇపుడు అదే హోదాలో ఉన్న జీవిత రాజశేఖర్ సమావేశం పెడితే.. తప్పు అవుతుందా?? అని హేమ నిలదీశారు. ‘మా’ అధ్యక్షునిగా నరేష్ తీరు అభ్యంతకరంగా ఉంది. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన మొదటి జనరల్ బాడీ మీటింగ్‌లో చాలా గొడవలు చేస్తున్నారు. గతంలో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకునేందుకు తనకు అన్ని అర్హతలున్నాయని చెప్పి అప్పట్లో ఆఫీసుకు తాళం వేసుకొని వెళ్లారు. అపుడు మీరు చేసిందేమి తప్పు కాదా అని నరేష్ ని నిలదీశారు హేమ..

 

అక్కడితో ఆగకుండా ‘మా’ జనరల్ సెక్రటరీ అయిన జీవిత ఫ్రెండ్లీ మీటింగ్ పెడితే మాత్రం మీకు తప్పుగా కనిపిస్తుందా ? మీకు అప్పట్లో ఉన్న హక్కు ఇపుడు జీవితకు ఉండదా?? మాపై పరువు నష్టం కేసులు పెట్టేందుకు., మీటింగ్ సభ్యులు హాజరు కాకుకండా మెసెజ్‌లు పంపించి వారిని బెదిరించేందుకు., ఉన్న సమయం మీటింగ్‌కు రావడానికి మాత్రం ఉండదా?? అంటూ నరేష్ పై హేమ ప్రశ్నల వర్షం కురిపించారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: