బిత్తిరి సత్తి... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. V6లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తల్లో బిత్తిరి సత్తి చేసే సందడి ఎరుగనిది  కాదు. ప్రతి తెలుగు ప్రేక్షకుడి మనుసులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్. v6 లో ప్రసారమయ్యే తీన్మార్ న్యూస్ లో బిత్తిరి సత్తి గా సందడి చేస్తూ ... చాలా ప్రత్యేకమైన హావభావాలతో, ఎవరికీ సాధ్యం కానీ మేనరిజంతో బిత్తిరి సత్తి అదరకొట్టాడు. బిత్తిరి సత్తి తెలుగు టీవీ ప్రేక్షకులను  ఎంత ప్రభావితం చేసాడు అంటే... ప్రేక్షకులు  అప్పటివరకు ఏ ప్రోగ్రాం చూస్తున్న  9:30 అయిందంటే v6 ఛానల్ కి మారి  తీన్మార్ చూసేంత తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాడు  బిత్తిరి సత్తి. అయితే తీన్ మార్ లో బిత్తిరి సత్తి గా చాలా ఫెమ్ కూడా సంపాదించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ లో చేసి మెప్పించాడు బిత్తిరి సత్తి. అయితే తాజాగా తుపాకి రాముడు గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 


 బతుకమ్మ,  ఆల్ రౌండర్ లాంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు ప్రభాకర్ దర్శకత్వంలో... టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాణంలో బిత్తిరి సత్తి తుపాకి రాముడు సినిమాలో నటించాడు. ఈ  సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం బిత్తిరి సత్తి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా  తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి పాల్గొన్నారు. అయితే ఏ సెలెబ్రిటీ ఇంటర్వ్యూ లో  పాల్గొన్న సూటిగా ప్రశ్నలు వేస్తుంటారు యాంకర్ టిఎన్ఆర్. అలాగే మీరు మంచి టాలెంటెడ్ అని మీ  గురించి తెలిసిన వాళ్ళు చెప్పారు... అలాగే మీరు విపరీతమైన డబ్బు మనిషి అని కూడా అన్నారు దీని గురించి మీరేమంటారు అంటూ బిత్తిరి సత్తి ని ఒక ప్రశ్న అడిగారు. 
 అందుకు  బిత్తిరి సత్తి సమాధానమిస్తూ.... నేను ఇక్కడికి  బతకడానికి వచ్చాను...  సమాజ సేవ చేయడానికి కాదని తెలిపారు. నేను చేసిన పనికి డబ్బులు అడిగితే అది తప్పు ఎలా అవుతుంది. ఛానల్ వారికి కావాల్సింది టిఆర్పి నాకు కావాల్సింది డబ్బు అంటూ బదులిచ్చాడు. నన్ను డబ్బు మనిషి అంటున్నారు.  ఎవరికి వద్దు... డబ్బు అవసరం లేనిది ఎవరికి అందరికి   నాకు మంచి ఇల్లు ఉండాలని... మంచి కారు లో  తిరిగాలని  ఉంటుంది కదా. చిన్న పని చేసేది డబ్బుకోసం... నాకు తెలిసిన పని చేయడమే. మోసం చేయడం అసలు తెలియదు అంటూ  బిత్తిరి సత్తి చెప్పుకొచ్చారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: