అందం చందం కలిపిన ముద్దుగుమ్మ  కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో జోడీ కట్టి టాలీవుడ్ కి  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది  ఈ అమ్మడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆ తర్వాత వరుస  అవకాశాలు  చేజిక్కించుకుని అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన హీరోయిన్స్  అందరూ అటు బాలీవుడ్ లో కూడా తమ లక్కు ను  పరీక్షించుకుంటారు. కానీ కాజల్  మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ చాలని... టాలీవుడ్లో మాత్రం సినిమాలు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లకు పైనే  గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కాజల్  హవా నడుస్తుంది. కొత్తగా వస్తున్న హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది కాజల్. 



 తాజాగా యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సీత సినిమాలో నటించి మెప్పించింది కాజల్. తాజాగా కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా  లో నటిస్తోంది. అయితే కాజల్ వయస్సెంతో   తెలుసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు... ఏముంది వికీపీడియా చూస్తే సరిపోతుంది అంటారా. కానీ కాజల్ అగర్వాల్ తన వయసెంతో  చెప్పి అందరినీ షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఈ భామ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ 90 ఏళ్ల సేనాపతి పాత్రలో కనిపించనుండగా  85 ఏళ్ల బామ్మ పాత్రలో అందాల భామ కాజల్ కనిపించనుంది. ఈ సినిమాలు పోరాట మరకలు తెలిసిన పాత్రలో నటిస్తుంది కాజల్ అగర్వాల్.



 అయితే తొంబై ఏళ్ళ వయసున్న  పాత్రలో   నటిస్తున్న కమలహాసన్ కోసం వైవిధ్యమైన పోరాట సన్నివేశాన్ని కూడా కంపోస్ట్ చేస్తున్నట్లు ఇటీవల స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలో... మరికొన్ని విభిన్నమైన పాత్రలో కాజల్  నటించడం చూసాం . కానీ కాజల్ కెరియర్ లోనే మొదటిసారిగా 85 ఏళ్ల బామ్మ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర చేయడం వల్ల కాజల్ o సాహసం చేస్తుందని చెప్పవచ్చు. దీంతో కాజల్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దీని గురించి మాట్లాడన కాజల్  ఇండియన్ 2 చిత్రంలో స్వీయ రక్షణ తెలిసిన అమ్మాయిగా కూడా  నటిస్తోందని ... ఆ పాత్ర వయసు మాత్రం చెప్పను అని తెలిపింది  కాజల్.


మరింత సమాచారం తెలుసుకోండి: