నాచురల్ స్టార్ నాని హీరోగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీతో హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ అంటూ వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు. తెలుగులో మినిమం గ్యారెంటీ హీరోగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న నాని ఈమధ్య నిర్మాతగా కూడా కొత్త టర్న్ తీసుకున్నాడు.


నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా అ!. నిర్మాతగా కూడా కొత్త ప్రయోగం చేసిన నాని అ! తర్వాత సెకండ్ సినిమా మొదలు పెట్టాడు. శైలేష్ డైరక్షన్ లో నాని సెకండ్ ప్రాజెక్ట్ ఈరోజు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు హిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.


మాములుగా సినిమా చూసిన ఆడియెన్స్ ఎలా ఉంది అంటే చూసిన సినిమా హిట్ అనకతప్పదు. అంటే ఒకవేళ బాగా లేకున్నా సరే హిట్ సినిమా అనక తప్పదు. టైటిల్ విషయంలో నాని ప్లాన్ అదిరిందని అంటున్నారు. అయితే టైటిల్ లో ఉన్న హిట్ కలక్షన్స్ లో వస్తుందా అన్నది చూడాలి. ఈ సినిమా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది.


నిర్మాతగా నాని కేవలం తన సినిమాలనే కాకుండా ఇతర హీరోల సినిమాలను చేస్తున్నాడు. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హీరోగా కన్నా నిర్మాతగా నాని మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. నాని హిట్ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈనగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సినిమాలతో టాలెంట్ చూపించిన విశ్వక్ సేన్ తో పాటుగా చిలసౌ తో సత్తా చాటిన రుహాని శర్మ కూడా ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: