కార్తి, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లేకార్తి, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్
పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లి (కార్తీ) జైలు నుండి తప్పించుకుని వెళ్లాలని అనుకుంటాడు. అయితే ఇలాంటి టైంలో 800 కోట్ల విలువగల డ్రగ్స్ పోలీసుల నుండి కొందరు రౌడీలు కాజేస్తారు. అయితే వారిని పట్టుకోవడం కోసం పోలీసులు ఢిల్లి సపోర్ట్ కావాలనుకుంటారు. ఢిల్లి పోలీసులకు సపోర్ట్ చేస్తూ అర్జున్ దాస్, రమన ల గ్యాంగ్ తో తలపడతాడు. ఇదంతా తన పదేళ్ల చిన్నారిని చూసేందుకు చేసే ప్రయత్నమే అని ఢిల్లికి తెలుసు. ఇంతకీ ఢిల్లి ఎందుకు జైలుకి వెళ్లాడు..? అతను పోలీసులకు ఎలా సహాయపడ్డాడు..? చివరకు ఢిల్లి అనుకున్నది సాధించాడా అన్నది సినిమా కథ.



ఖాకీ సినిమా తర్వాత కార్తి నటించిన ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ ఖైది. సినిమా స్టార్టింగ్ నుండి చివరి వరకు కార్తి తన నటనతో ఆకట్టుకున్నాదు. ఎంతో ఇంటెన్స్ తో ఢిల్లి పాత్ర నుండి బయటకు రాకుండా తన నటనతో మెప్పించాడు. పోలీస్ ఆఫీసర్ నరేన్ పాత్ర కూడా మెప్పించింది. సినిమాలో అర్జున్ దాస్, రమణల పాత్రలు మెప్పించాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.



సత్యన్ సూరియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అతని కెమెరా వర్క్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. సాం సిఎస్ మ్యూజిక్ బిజిఎం ఆకట్టుకుంది. సినిమా మూడ్ ను బట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రతిభ చాటాడు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



దేవ్ లాంటి స్టైలిష్ ఎంటర్టైనర్ తర్వాత కార్తి ఖైదితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి. ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ బాగా సిద్ధం చేయగ.. దానికి తగినట్టుగా కథనం గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. ముఖ్యంగా కేవలం నాలుగు గంటల్లో జరిగే కథగా సినిమాలో తర్వాత ఏం జరుగుతుంది అన్న ఎక్సైట్ మెంట్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 


సినిమాలో కార్తి నటన అద్భుతంగా అనిపిస్తుంది. ఢిల్లి పాత్రలో తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కార్తి. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను టచ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా అంతా ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.


అయితే సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడం.. హీరోయిన్.. సాంగ్స్ ఇవన్ని లేకపోవడం కూడా మైనస్ అనిపిస్తుంది. 2 గంటల 20 నిమిషాల రన్ టైం తో వచ్చిన ఖైది రొటీన్ సినిమాలు మెచ్చే ఆడియెన్స్ కన్నా డిఫరెంట్ సినిమాలు చూసే ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉంది. 



కార్తీ,నరైన్, జార్జి మరియన్, లోకేష్ కనగరాజ్కార్తి 'ఖైది'.. మెప్పించేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: