మాస్ మహారాజ రవితేజ కెరియర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హీరోగా వరుస హిట్లు కొట్టిన సందర్భంలో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'రాజా ది గ్రేట్' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ తర్వాత చేసిన సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో రవితేజ మార్కెట్ డౌన్ కావడంతో ప్రస్తుతం రవితేజ కెరీర్ డేంజర్ జోన్ లో ఉందని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం 'డిస్కో రాజా'. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో రవితేజ డబల్ రోల్ లో అనగా తండ్రి కొడుకులు పాత్రలో రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.


రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ క‌థానాయికలుగా నటిస్తుండ‌గా… సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా ఐస్లాండ్ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇటీవల బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో పోరాటాల సన్నివేశాల కోసం రవితేజ ఐస్ ల్యాండ్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేశాడని ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఐస్ ల్యాండ్ షెడ్యూల్‌లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు స‌మాచారం.


ప్రస్తుతం… హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని వినికిడి. యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.థమన్ బాణీలు అందిస్తున్న ‘డిస్కో రాజా’… క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సినిమా యూనిట్ ట్రై చేస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని రవితేజ అభిమానులు కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: