అలనాటి పరమానందయ్య శిష్యుల కథ తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమే. ఈ  నేపధ్యంలో పింక్ రోజ్ సినిమా పతాకంపై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సిహెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం శ్రీ పరమానందయ్య శిష్యుల కథ త్రీడి తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా చిన్నారుల కోసం రెడీ ఫార్మెట్లో తెరకెక్కిన సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.


సినిమా వెంకట రాజేష్ పులి దర్శకత్వంలో తెరకెక్కనున్నది. తాజాగా ఈ సినిమా టీజర్ ని డైనమిక్ డైరెక్ట్ ర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల కోసం పిల్లలకు నచ్చే విధంగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాడుకొని మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథ కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు చిత్ర బృందానికి డైరెక్టర్ మారుతి గారు అభినందనలు తెలియజేశారు. 


ఈ త్రీ డి చిత్రము హైదరాబాదులో దర్శకుడు మారుతి గారు విడుదల చేశారు. ఈ చిత్రమును పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. పరమానందయ్య శిష్యుల కథ త్రీ డి లోని నీతిని చిన్నారులకు మరింత దగ్గర చేయడం కోసమే ఈ చిత్రాన్ని త్రీడి చేసాము. ఇది అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది అని చెప్పారు. అప్పట్లో నటరత్న ఎన్టీఆర్ నటించిన పరమానందయ్య శిష్యుల కథ బాగా పెద్ద విజయం సాధించింది.


పరమానందయ్య శిష్యుల కథ టీవీ సీరియల్ గా కూడా వచ్చి గొప్ప ఘన విజయం సాధించింది. ఈ కథ ప్రతి తరాన్ని అలరిస్తూనే ఉన్నది. ఈ తరాన్ని కూడా అలరించడానికి మన ముందుకు వచ్చింది. ఈ కథకు కూర్పు చేసినది కార్తీక్ శ్రీనివాస్. ఛాయా గ్రహణము జి. ప్రభాకర్ రెడ్డి, సంగీతము యాజమాన్య వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: