కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ మూవీ తెలుగులో ‘విజిల్’ మూవీగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా నయనతార కనిపించనుంది.  తమిళంతోపాటు తెలుగులోను ఈ సినిమాను రేపు విడుదల చేయనున్నారు. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ నిర్మించారు. ఈ మూవీ తెలుగులో 'విజిల్‌' పేరుతో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు అందిస్తున్న విషయం తెలిసిందే.

దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్‌ విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించింది. నయనతార గ్లామర్‌ సినిమాకు ఓ ప్లస్‌ కానుంది. ఒలంపిక్స్ నేప‌థ్యం ఉన్న కథలో విజయ్.. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, రౌడీగా, నాయకుడిగా కనిపిస్తున్నారు. కళ్లు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్‌తో విజిల్ వేయిస్తున్నాడు విజయ్.

ఈ మూవీలో విజయ్ సరసన నయనతార నటించగా.. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలను సమకూర్చారు. గతంలో అట్లి దర్శకత్వంలో తెరీ,మెర్సల్ మూవీస్ వచ్చాయి.  ఇందులో మెర్సల్ మూవీ తెలుగులో ‘అదిరింది’గా రిలీజ్ చేశారు.  ఈ మద్య విజయ్ నటించిన మూవీస్ ఎన్నో కాంట్రవర్సీలతో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

బిగిల్ మూవీ పై మాంసం విక్రయదారులు అభ్యంతరం తెలిపారు..తాము ఎంతో గౌరవంగా పూజింజే కత్తి మూవీ పోస్టర్ లో విజయ్ కాలు వద్ద ఉండటంపై పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెలిసిందే.  అన్ని అవాంతరాలు దాటుకొని రేపు విడుదలకు సిద్దం అవుతుంది..ఈ మూవీ ట్రైలర్ బట్టి చూస్తే మరో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు విజయ్ అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: