అమలాపాల్ బన్నీతో ఇద్దరమ్మాయిలతో, చరణ్ తో  నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్య ఆమె నుంచి వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా ఆడటం లేదు. ధనుష్ నటించిన 'వీఐపి2 ' ఆమె కూడా ఆమెకు పేరు తీసుకురాలేదు. రూటు మార్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఒక సినిమాలో నగ్నం నటించిన ఆమె సినిమా కూడా అంతగా ఆడలేదు .


ఆమెకు ఐదు  సంవత్సరాలు క్రితం ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్. విజయ్‌ను ప్రేమించి పెళ్లి  చేసుకున్నారు. మూడేళ్ల కాపురం చేసిన తర్వాత ఇద్దరి మనస్పర్ధలు రావడంతో 2017లో వీళ్లిద్దరు  విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ హీరోయిన్‌గా తిరిగి బిజీ అయింది.విజయ్ డైరెక్షన్‌తో బిజీ అయ్యాడు. రీసెంట్‌గా ఏ.ఎల్.విజయ్..ఎంచక్కా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.


విడాకులు తీసుకున్న తర్వాత ఈ భామ చాలా బోల్డ్ గా తయారైందని చెప్పాలా ఆమె నటించిన చిత్రాలు మరియు ఆమె హాట్ హాట్ ఫోటో షూట్లతో జనాలకు నిద్రలేకుండా చేసింది.ఈమె తీసిన ఆమె సినిమా ని బాలీవుడ్ లో మరో కాంట్రవర్సియల్ కథానాయిక కంగనా రనౌత్  నటిస్తున్నారు .ఆ సినిమా అక్కడ అన్న ప్రజలకి నచ్చుతుందో లేదో .


తాజాగా కొంతమంది విలేఖరులు మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా ? త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా. అదీ కూడా ప్రేమ పెళ్లినే చేసుకుంటా అని చెబుతోంది. ఇక అమలాపాల్ ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అది సక్సెస్ కాలేదు. ఇపుడు రెండో పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానని చెబుతుంది. దీన్ని బట్టి అమలాపాల్‌కు ప్రేమపై ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: