వర్మపై  తాజాగా మన బాహుబలి అయిన ప్రభాస్‌ ప్రశంసల వర్షం కురిపించారు.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలా కలం అయినా ఇప్పటికీ  ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమాని ప్రదర్శిస్తూనే  ఉన్నారు . తాజాగా మొన్న బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించారు.

ఇప్పటివరకు రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించిన తొలి ఇంగ్లీష్ హేతర సినిమా మన  ‘బాహుబలి’  కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా దగ్గుబాటి , ప్రభాస్‌, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు.

చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్‌, రానా బీబీసీ విలేకరి హరూన్‌ రషీద్‌తో కొంచెం సేపు ముచ్చటించారు. బాహుబలి సక్సెస్‌ గురించి తమ అనుభూతులను వాళ్ళతో పంచుకున్నారు. బాహుబలి కి ముందు  తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్‌ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం గురించి  ప్రభాస్‌ ప్రస్తావించారు. దాదాపు 30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన  శివ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది అని తెలిపారు ప్రభాస్ .

బాహుబలికి ముందు ఆ సినిమానే అని,ఆ సినిమాతోనే తెలుగు సినిమా అంచనాలను,తెలుగు సినిమా సత్తా  చూపిన చిత్రం అదే అని చెప్పారు ఆయన. నాగార్జున గారికి కూడా ఆ సినిమాతోనే మంచి క్రేజ్ వచ్చింది అనితెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో అప్పట్లో చాటిన డైరెక్టర్ అంటే ఆయనే అని వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు.అయితే బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్‌ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన  శివ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన సంగతి అందరికి  తెలిసిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: