విభిన్నమైన పాత్రలు పోషించడం అంటే మొదట గుర్తొచ్చేది కమల్‌ హాసన్‌.విభిన్నమైన పాత్రలు పోషించడంలో ఆయనకు మరెవరు సాటి లేరు,రారు కూడా.ఇలాంటి  పాత్రలు చెయ్యటానికి ఆయన తప్ప ఇంకే నటుడు లేరంటే అది అతిశయోక్తి కాదు. తాను ఏ పాత్ర పోషించినా.. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేసేందుకు ఆయన  పూర్తిగా తపిస్తారు. ఒక అగ్రస్థాయి హీరో అయినప్పటికీ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలను కమల్‌ పోషించారు. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాలు వైపు అడుగులు వేసిన కమల్‌ హాసన్‌ త్వరలో భారతీయుడు-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

భారతీయుడు సినిమాలో అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను హడలెత్తించి,అంతం చేసే సేనాపతి పాత్రతో కమల్‌ తన విశ్వరూపం చూపిన సంగతి మన అందరికి  తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌లో ఆయన మరోసారి సేనాపతిగా తన ఫ్యాన్స్‌ను పలుకరించబోతున్నారు. భారతీయుడు-2లో ఆయన లుక్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తి అందరిలో ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతుండగా.. సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో  లీకై హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో కమల్‌ లుక్‌ సంబంధించిన ఫొటో లీకైంది. షూటింగ్‌లో భాగంగా కమల్‌ మేకప్‌ వేసుకుంటుండగా తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  పూర్తిగా వైరల్‌ గా అవుతోంది. సేనాపతిగా కంప్లీట్‌గా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న కమల్‌ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడం ఖాయమని ఈ ఫొటోపై నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్  చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో 2003లో వచ్చిన  భారతీయుడు  సినిమాకు ఇది సీక్వెల్‌. కమల్‌,శంకర్‌  కంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ మూవీలో  కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటీమణులుగా నటిస్తున్నారు. ప్రియాభవనీ శంకర్‌, సిద్ధార్థ, విద్యుత్‌జమాల్‌, ఢిల్లీ గణేశ్‌ వంటి ప్రముఖ తారలు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: