టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గత ఏడాది తన కెరీర్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసితో సినిమాలకు వీడ్కోలు పలికారు. ఇక ఆ తరువాత నుండి తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నయిన పవన్ కళ్యాణ్, ఇటీవలి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా రెండు స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా రెండు స్థానాల్లో కూడా పవన్ ఘోర పరాజయాన్ని పొందారు. దానితో ఇకపై తన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లోపు అన్ని విధాలుగా సిద్ధమవ్వాలని, ఇప్పటినుండే పలు ప్రణాళికలు సిద్ధం చేసి, త్వరలో ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారు. 

అయితే మధ్యలో సినిమా ఫంక్షన్లకు అక్కడక్కడా హాజరవుతున్న పవన్, ఇటీవల తన అన్నయ్య చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఉద్యమాల్లో మంచి నాయకుడిగా పేరుగాంచిన జార్జి రెడ్డి సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా పవన్ హాజరు కానున్నట్లు టాక్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ పవన్ కు ఎంతో నచ్చిందని, నిర్మాతల ఆహ్వానం మేరకు అతి త్వరలో జరుగనున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన హాజరు కానున్నారని అంటున్నారు.

1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి, సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా వచ్చే నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా పవన్ కనుక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు వస్తే, సినిమాకు కొంత హెల్ప్ అవడం ఖాయం అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: