టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక ఆ తరువాత కొంత ఆలోచనలో పడ్డ బాలకృష్ణ, ఫ్యాన్స్ కు ఎలాగైనా మంచి విజయం అందివ్వాలని తపనతో గత ఏడాది తనకు జైసింహా సినిమాతో మంచి హిట్ ని ఇచ్చిన, తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ కు మరొక అవకాశం ఇచ్చి, 

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తన కెరీర్ 105వ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని, ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 2గం. 50ని. లకు అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా నిర్మాణ సంస్థైన హ్యాపీ మూవీస్ వారు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. 

అయితే గత కొద్దిరోజుల నుండి ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెడతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫ్రెంచ్ గడ్డంతో స్టైలిష్ సూట్ వేసుకుని ఉన్న బాలకృష్ణ అల్ట్రా మోడరన్ లుక్స్ ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ అయి, మంచి స్పందనను రాబట్టడం జరిగింది. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని భావించినప్పటికీ, ఇప్పటికే ఆ సమయానికి కొన్ని సినిమాలు బెర్తులు రిజర్వు చేసుకోవడంతో దీనిని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: