తెలుగు లో వస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యింది యాంకర్ అనసూయ.   ‘జబర్ధస్త్’ కామెడీ షో  ఆరు సంవత్సరాలుగా వస్తున్న విషయం తెలిసిందే.   ‘జబర్ధస్త్’ తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించింది.  దాంతో ఆమెకు ఇతర ఛానల్స్ లో ప్రైవేట్ కార్యక్రమాల్లో బిజీగా మారిపోయింది.  దాంతో ఆమె  ‘జబర్ధస్త్’ కామెడీ షో  కి కొంత కాలం గుడ్ బాయ్ చెప్పేసింది.  ఈమే స్థానంలో రష్మీ గౌతమ్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. 


అయితే కొంత కాలం తర్వాత  ‘జబర్ధస్త్’ కామెడీ షో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ.  కేవలం యాంకర్ గానే కాకుండా వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ.  సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమాతో అనసూయకు మరింత క్రేజ్ పెరిగింది. వివాహమైనా.. ఇద్దరు పిల్లలు ఉన్నా తన గ్లామర్‌తో యువతను కట్టిపడేస్తున్నారు అనసూయ. 


తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయకు ఎద భాగం పై టాటు వేయించుకోవడం వల్ల మరింత సెక్సీ గా మారి గిలిగింతలు పెట్టింది.  దానిపై అప్పట్లో ఎన్నో కామెంట్స్ వచ్చాయి. తాజాగా తన చేయిపై కొత్త టాటూ వేయించుకొని ఫోటో షూట్స్ తో మరోసారి హల్ చల్ చేసింది అనసూయ.  తాజాగా అనసూయ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు కూడా హాట్‌గా ఉన్నాయి. అంతేకాదు.. ట్విట్టర్‌లో అయితే తన ఫొటోలకు క్యాప్షన్‌గా లాలీపాప్ ఎమోజీని అనసూయ పెట్టారు. దానర్థం ‘స్వీట్‌నెస్’. అంటే తానెంతో స్వీట్ అని అనసూయ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: