సల్మాన్ ఖాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన దబాంగ్, దబాంగ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సీరీస్‌లో భాగంగా ఇప్పుడు సల్మాన్ ఖాన్-ప్రభుదేవా క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న మరో సినిమా దబాంగ్-3. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2లో లేని సరికొత్త అంశాలతో ఈ సినిమా రూపొందుతుందని లేటెస్ట్ న్యూస్. దబాంగ్-3 లో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ హీరోయిన్స్‌గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ తో కలిసి శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ సమర్పణలో ఆర్బాజ్ ఖాన్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది దబాంగ్-3 సినిమాని నిర్మిస్తున్నారు. 

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా సరికొత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిచ్చా సుదీప్ పవర్ ఫుల్ విలన్‌గా నటించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా థియోట్రికల్ ట్రైలర్‌ని అక్టోబర్ 23న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. అంతేకాదు అన్నిచోట్లా పీవీఆర్ థియేటర్స్‌‌లో దబాంగ్-3 ట్రైలర్ విడుదల కావడం విశేషం.

ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి రైటర్‌ సల్మాన్ ఖాన్.. దబాంగ్ పార్ట్ 1, పార్ట్ 2 కంటే దబాంగ్ పార్ట్ 3 చాలా కొత్తగా ఉంటుంది. సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ ఇద్దరు ఒకరికొకరు పోటాపోటీగా నటించారు. ఇక వీళ్ళలో సల్మాన్ లవ్ జర్నీ ఎవరితో అన్నది సినిమాని స్క్రీన్ మీద చూసేవరకు సస్పెన్స్ అని సల్మాన్ అంటున్నారు. సై మంజ్రేకర్ మొదటి సినిమా అయినా ఎక్కడా టెన్షన్ పడకుండా సింగల్ టేక్‌లో చేసిందట. అంతేకాదు తను బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని మన కండల వీరుడు కాన్‌ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ మాస్ ప్రేక్షకులందరు ఎంజాయ్ చేసేవిధంగా ఉంది. ఇక సల్మాన్ త్వరలో పూరి జగన్నాధ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని కూడా వెల్లడించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: