నటుడు మరియు దర్శకుడు అయిన రవిబాబు తెరకెక్కిస్తున్న 'ఆవిరి' చిత్రం మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ మధ్యనే కొన్ని నెగిటివ్ వార్తలు ఈ దర్శకుడి పైన రావడం మొదలుపెట్టాయి. అతనితో మూడు సినిమాలు చేసిన సినీ నటి 'పూర్ణ' ని అతను లైంగికంగా వేధించాడని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయంపై రవిబాబు సరిగ్గా ఆరోజు సెట్ లో ఏం జరిగిందో ఒక టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

ముందుగా 'అవును' సినిమాలో పూర్ణ బాత్రూమ్ లో షవర్ తో స్నానం చేస్తున్నప్పుడు బయట నుండి ఒక రూపం ఆమెను కర్టెన్ నుండి చూస్తున్నట్లు ఒక సీన్ ఉంటుంది. ఈ విషయాన్ని పూర్ణ కి వెల్లడించగా ఆమె కూడా సరే అని అందట. ముందుగా ఆమెకు టెస్ట్ షాట్ కూడా చూపించినప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పిన పూర్ణ మెయిన్ షాట్ తీసేటప్పుడు మాత్రం తాను ఈ సీన్ చేయలేను అని బయటికి పరుగెత్తేసిందట.

ఇక తర్వాత ఏం జరిగిందంటే రవిబాబు అతని టీమ్ తో ఆమెను తిరిగి కొచ్చికి పంపించేయమని... ఇక కొత్త హీరోయిన్ ని తీసుకొని వచ్చి అప్పటివరకూ జరిగిన 12 రోజుల షూటింగ్ ను మళ్ళీ తెరకెకిద్దామని అనుకున్నాడట. కానీ తర్వాత పూర్ణ మరియు ఆమె తల్లి వచ్చి రవి బాబుకి క్షమాపణలు చెప్పి మొత్తం సినిమా ముగించేశారు. తర్వాత 'అవును' సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం కూడా మనకు తెలుసు.
 
ఆ తర్వాత పూర్ణ హీరోయిన్ రవి బాబు మరో రెండు సినిమాలు కూడా తీశాడు. కాబట్టి రవి బాబు పూర్ణను ఎలాంటి టార్చర్ చేయలేదన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రవిబాబు తీసే సినిమాలు మరియు నటించిన పాత్రలలో విలనిజం ఎక్కువగా ఉండడంతో అనవసరంగా అతనిపై ఇలాంటి నిందలు వస్తున్నాయి కానీ రియల్టీలో అతను చాలా మంచిమనిషి అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: