అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లోనే కాదు కబీర్ సింగ్ గా తెరకెక్కిన బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే సంచలనం. బోల్డ్ కంటెంట్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్..వగైరా వంటివి చాలానే ఉన్నాయి. అంతేకాదు బోలెడన్ని పచ్చి బూతులు ఉన్నాయి. అయినా ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి విపరీతంగా నచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హిస్టరి క్రియోట్ చేసింది. అందుకే సందీప్ కి ఒక ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. కాని ఆ ఛాన్స్ నాకొద్దని నిర్మొహమాటంగా నో చెప్పినట్లు లేటెస్ట్ న్యూస్. లస్ట్ అండ్ సెక్స్ కాన్సెప్ట్‌తో ఉన్న సినిమాలను నేను డైరెక్ట్ చేయనని అంటున్నారు సందీప్ రెడ్డి వంగా. 

బాలీవుడ్‌లో వివాదాస్పదమైన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు భాగాలుగా దీనిని తెరకెక్కించనున్నారని, ఒక భాగాన్ని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సందీప్ రెడ్డి స్పందించారు. తనకు డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చిన మాట నిజమేనని వెల్లడించారు.

అయితే తను లస్ట్ స్టోరీస్ రీమేక్‌ను డైరెక్ట్ చేయనని చెప్పానని అన్నారట. తనకు లస్ట్, సెక్స్ బేస్డ్ కాన్సెప్ట్స్‌ అంటే ఆసక్తి లేదని పేర్కొ్న్నారు. అయితే త్వరలో ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మరో ఐదేళ్ళ లో నేను ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. కొందరు స్నేహితుల నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్. దీనిని నేను సినిమాగా తీయలేను. ఎందుకంటే సెన్సార్ బోర్డు విడుదల చేయడానికి ఒప్పుకోదని తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా టీ సిరీస్  నిర్మిస్తున్న ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: