తమిళ హీరో  ధనుష్ వెట్రిమారన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అసురన్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్  గా వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలై  బాక్సాఫీస్  వద్ద  కలెక్షన్ల వర్షం కురిపించింది.  కేవలం 20రోజుల్లోనే  ప్రపంచ వ్యాప్తంగా 70కోట్లగ్రాస్ వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ లో చేయడానికి  స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో ప్రముఖంగా రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినపడింది.  ఆయన ఈ రీమేక్ లో నటించనున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా  ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 




ఇక ఈ రీమేక్ లో విక్టరీ వెంకటేష్  హీరోగా నటించనున్నాడని సురేష్ ప్రొడక్షన్స్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్  ను నిర్మించిన  కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్టర్ చేయనున్నారో తెలియాల్సి వుంది.  ఇదిలా ఉంటే  వెంకీ మాస్ పాత్రలు చేసి  చాలా  కాలం అవుతుంది. ఇక ఇప్పుడు అసురన్ రీమేక్ తో  ఆ పాత్రలో నటించి తన అభిమానులను అలరించనున్నాడు.  ఇక ఇప్పటివరకు వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన దాదాపు అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . మరి ఇప్పుడు అసురన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్ 2 తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన వెంకటేష్  ఇటీవలే  వెంకీ మామ సినిమా ను పూర్తి చేశాడు.  మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాగ చైతన్య మరో హీరో గా నటించాడు.  ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా  రిలీజ్ డేట్  విషయంలో మాత్రం మేకర్స్  ఇప్పటికీ  క్లారిటీ ఇవ్వడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: