టాలీవుడ్ సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి రీసెంట్‌గా దర్శకరత్న దాసరి నారాయణ రావు, అలాగే మెగాస్టార్ చిరంజీవి మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మొన్నీ మధ్య మెగాస్టార్ చిరంజీవి.. వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఇలా జగన్ ను మెగాస్టార్ కలవడంపై వస్తున్న రూమర్స్‌ను ఖండిస్తూ పాజిటివ్‌గా స్పందించారు తమ్మారెడ్డి. ఇటీవల చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, అలానే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు దగ్గరకు వెళ్లి సైరా సినిమాను చూపించారు. ప్రధానమంత్రిని కూడా కలిసి సైరా సినిమా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి. అయితే వీటిపై యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్ మాత్రం వింతగా విచిత్రంగా ఉన్నాయి.. ఇండస్ట్రీలో స్వర్గీయ దాసరి నారాయణ రావుగారి ప్లేస్‌ను భర్తీ చేసేందుకు చిరంజీవి ఇవన్నీ చేస్తున్నారని. ఇది నాకు చాలా కామెడీగా అనిపించింది...అన్నారు తమ్మారెడ్డి.   

ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో చిరంజీవి పెద్ద నటులు. ఆయన తలచుకుంటే ఏ స్థానమైనా తీసుకోవచ్చు. ఆయన కావాలనుకుంటే.. దాసరి గారి పొజీషన్ అనేది అఫీషియల్ పోస్ట్ కాదు. ఏ పదవి లేదు అక్కడ. దాసరి గారు పెద్ద మనిషిగా ఉన్నారు. అందరితో కలిసి మాట్లాడేవారు. అలాగే చిరంజీవి గారు చేయొచ్చు. ఆయన్ని చేయమని నేను రెండు మూడు సార్లు అడిగాను కూడా. అలానే 'మా' ఇష్యూలో కూడా గతంలో చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించారు. 

సో ఇండస్ట్రీలో ఏదైనా చేయాలి అనుకుంటే చిరంజీవి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్తారు. జగన్ ఏమైనా చెప్తారా? ఆయనేమైనా  ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? దీని కోసం చిరంజీవి ఆయన దగ్గరకు ఎందుకు వెళ్తారు. వీళ్లకు తెలిసి మాట్లాడతారో తెలియకమాట్లాడతారో.. లేక అమాయకత్వమో, మూర్ఖత్వమో నాకు తెలియడం లేదు. చిరంజీవి పేరు చెప్తే మనకు క్రేజ్ వస్తుందని అనుకోవడమో నాకు అర్ధం కాలేదు...ఇవన్ని పెద్ద జోకులుగా అనిపిస్తున్నాయంటు తమ్మారెడ్డి అన్నారు. వాస్తవంగా చూస్తే తమ్మారెడ్డి గారు అన్న మాటల్లో నిజముంది. ఈ విషయం అందరు తప్పకుండా గమనించాలి. అంతేకాకుండా తెలిసీ తెలీకుండా ఏది పడితే అది కామెంట్ చేయకూడదు అని తమ్మారెడ్డి గారు మాటలు విన్న వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: