తమిళ నటుడు మరియు ఇళయదళపతి గా పేరుగాంచిన నటుడు విజయ్, ఒక్కొక్క సినిమాతో తమిళ నాట తన క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్నారు. అంతేకాక ఇటీవల వరుసగా మంచి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా బిగిల్. విజయ్ తొలిసారి స్పోర్ట్స్ నేపథ్యంలో నటించిన ఈ సినిమా పై తమిళనాడు సహా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక నేటి తెల్లవారుజామున యుఎస్ఏ, యుఎఈ వంటి దేశాల్లో పడిన ఈ సినిమా ప్రీమియర్ షోల నుండి వస్తున్న టాక్ ని బట్టి, ఈ సినిమా విజయ్ కెరీర్లో మరొక సక్సెస్ఫుల్ సినిమాగా మిగిలే అవకాశం గట్టిగా కనపడుతోందట. 

విజయ్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో నటిచడం జరిగిందట. బిగిల్, రాయప్పన్, మైఖేల్ అనే పాత్రలతో ఈ సినిమాలో ఆయన నటించారట. ఇక ఎప్పటిలానే విజయ్ ఇంట్రడక్షన్ సీన్ మంచి మాస్ స్టైల్ లో అదిరిపోతుందని, ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత ఎంటర్టైనింగ్ గా అలానే సరదాగా సాగుతుందని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే రైల్వే స్టేషన్ మాస్ ఫైట్ ఎపిసోడ్ తో సినిమా మరొక రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు. ఇక ఒకింత మెల్లగా ప్రారంభమయ్యే సెకండ్ హాఫ్, కొద్దిసేపటి తరువాత పుంజుకుంటుందని, ఆ తరువాత నుండి సినిమా అసలు ప్లాట్ లోకి ప్రవేశించి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా సాగుతుందని అంటున్నారు. ఇక సినిమాలో ఒలింపిక్స్ ని కథలో ఒక ముఖ్యమైన అంశంగా ఎంతో బాగా చూపారని, 

అలానే మహిళలకు సంబందించిన ఒక మంచి పాయింట్ ఈ సినిమాలో దర్శకుడు బాగా చూపించారని చెప్తున్నారు. ఇక సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంతో బాగా ఉంటాయని, అలానే కొన్ని సీన్స్ లో ఆడియన్స్ కంట కన్నీరు రావడం ఖాయం అని అంటున్నారు. మొత్తంగా ఈ బిగిల్ సినిమా, ఆకట్టుకునే విజువల్స్, మాస్ మరియు యాక్షన్ సీన్స్, ఫైట్స్, అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మంచి సాంగ్స్ తో వెరసి ఓవర్ ఆల్ గా మంచి విజయవంతమైన సినిమాగా నిలిచే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు. ఇక మన తెలుగు భాషలో విజిల్ పేరుతో అనువదించబడిన ఈ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చినట్లు సమాచారం. మరి మున్ముందు ఈ సినిమా ఎటువంటి టాక్ తో ఎంతమేర కలెక్షన్స్ తో దూసుకెళ్తుందో చూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: