సాధారణంగా రాజమౌళి వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే అతడు ఈమధ్య లండన్ లో ‘బాహుబలి’ ప్రదర్శన సందర్భంగా లండన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కొన్ని హిందూమత సంఘాలకు అసహనం కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ లోని అమరేంద్ర బాహుబలి పాత్రను శ్రీరాముడుతో పోల్చడమే కాకుండా రాజమౌళి రామాయణ మహాభారతాల పై కొన్ని విచిత్ర కామెంట్స్ చేసాడు. 

అమరేంద్ర బాహుబలి పాత్రలో అన్నీ శ్రీరాముడి లక్షణాలు కనిపిస్తాయని కామెంట్స్ చేసాడు. అంతేకాదు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మధ్య గల తేడాలను సినిమాలతో పోలుస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ చిత్రాలకు పనికి వచ్చే కథ  శ్రీకృష్ణుడుది అయితే శ్రీరాముడి  కథ కమర్షియల్ సినిమాలకు పనికిరాదని అంటూ శ్రీరాముడు జీవితంలో సీత ఒక్కరే భార్య అయితే శ్రీకృష్ణుడికి ఎంత మంది  భార్యలో  అందరికీ తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

రాముడి లైఫ్ లో ఒక్క భార్యతోనే బోరింగ్ గా  సాగిందని జోక్ చేస్తూ కృష్ణుడి లైఫ్ లో వేలమంది గోపికలు ఉన్నారు అంటూ విచిత్ర కామెంట్స్ చేసాడు. రాముడు తండ్రి మాట జవదాటని వ్యక్తి అని చెపుతూ అలాంటి విషయాలు ప్రస్తుత కమర్షియల్ సినిమాలకు సరిపోవు అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. రామాయణం రాసేడప్పుడు వాల్మీకి రాముడు పక్కన  లక్ష్మణుడు అంజనేయుడు లాంటి మాస్ పాత్రలు మాత్రం అద్భుతంగా రాసారు అని అంటూ రాముడు కోసం అనేక త్యాగాలు చేసిన ఆ పరాక్రమవంతుల పాత్రల స్పూర్తితో తాను కట్టప్ప పాత్రను డిజైన్ చేసిన విషయాన్ని వివరించాడు. 

వాస్తవానికి శ్రీరాముడుని ఎవరైనా విమర్శిస్తే వెంటనే హిందువులలో తిరుగుబాటు వస్తుందని అయితే అదే శ్రీకృషుడుని విమర్శిస్తే ఆ హిందువులే నవ్వి ఊరుకుంటారని అంటూ జక్కన్న చేసిన కామెంట్స్ హిందూ మత సంఘ నాయకులలో అసహనాన్ని కలిగిస్తున్నాయి. రామాయణ మహాభారతాలలోని మూల విషయాలను తెలుసుకోకుండా ఆ పురాణాలను కమర్షియల్ సినిమాలకు రాజమౌళి లింక్ చేయడం ఏమిటి అంటూ హిందు మత సంఘ వర్గాలు రాజమౌళి మండి పడుతున్నట్లు టాక్. ఇంతకి రాజమౌళి రామాయణ మహాభారతాలలోని విషయాలను బాహుబలితో ఎందుకు పోల్చాడో అర్ధంకాని విషయం..   


మరింత సమాచారం తెలుసుకోండి: