తెలుగు లో ఈ మద్య యాంకర్లు కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు..వెండి తెరపై కూడా రాణిస్తున్నారు.  బుల్లితెరపై కెరీర్ మొదలు పెట్టిన సుమ తర్వాత యాంకర్ గా మారి కొన్ని సినిమాల్లో నటించారు.  జబర్దస్త్ కామెడీ షో తో పరిచయం అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు.  మరోయాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పటికే ఐదారు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పటాస్ షో లో రాములమ్మగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి సైతం కొన్ని సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం బిగ్ బాస్ 3 లో కంటిస్టెంట్ గా గట్టి పోటీ ఇస్తున్న శ్రీముఖి నిన్న టాస్క్ లో భాగంగా తన జీవితంలో జరిగిన ఛేదు అనుభవాలు ఆడియన్స్, ఇంటి సభ్యులతో పంచుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో మిగిలిన పోటీదారుల్లో ఒక్కొక్కరు తమ లైఫ్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. వరుణ్ సందేశ్ గోవాలో జరిగిన అనుభవం గురించి చెప్పారు.  ఈ క్రమంలో శ్రీముఖి తన లవ్‌బ్రేకప్‌ను బయటపెట్టింది. 

తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి వరకు తానెక్కడా బయటపెట్టలేదన్న శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు రిలేషన్‌షిప్ ఉందని, దానినెప్పుడూ బయటపెట్టలేదని పేర్కొంది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని అనుకుంటున్న సమయంలో రిలేషన్షిప్ లో మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అయిందని..ఆ సమయంలో తాను ఒంటరిగా ఫీల్ అయ్యానని, ఒకదశలో తాను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ కూడా అయ్యానని బాధపడింది.

అయితే తను ప్రేమించిన వ్యక్తి ఎవరనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు.  మనకంటూ మెచ్యూరిటీ లెవెల్ బాగా ఉన్నపుడే రిలేషన్ షిప్ మెయింటేన్ చేయాలని హితవు పలికింది.  తన జీవితంలో ‘అగ్లీ బ్రేకప్’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా మనిషి ఆర్థికంగా, కెరీర్ పరంగా బాగా ఉన్నపుడు, మనల్ని కావాలని కోరుకున్నవారితోనే సంబంధాలు కలుపుకోవాలని సూచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: