‘అల వైకుంఠపురములో’ మూవీ మ్యానియాను పెంచడానికి ఇప్పటి నుంచే అనేక వ్యూహాలను రచిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించి మొదటి పాట ‘సామజవరగమన’ విడుదలై ఆ పాట జనానికి విపరీతంగా నచ్చడంతో ఆపాటకు యాభై మిలియన్‌ వ్యూస్‌ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా రేపటి రోజున ఈమూవీకి సంబంధించిన రెండవ పాట ‘రాములో రాముల’ రేపు విడుదల కాబోతోంది. 

అయితే ఈమూవీలోని ‘సామజవరగమన’ కొన్ని ప్రవేట్ సాంగ్స్ ట్యూన్స్ ను పోలి ఉంది అంటూ చెప్పడమే కాకుండా సంగీత దర్శకుడు తమన్ చాల తెలివిగా ప్రవేట్ సాంగ్స్ ట్యూన్స్ కు కొద్దిగా మార్పులు చేసి ‘అల వైకుంఠపురములో’ దించేస్తున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ తో హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు ఈన్యూస్ వైరల్ గా మారడంతో బన్నీ అభిమానులతో పాటు ఈ మూవీ బయ్యర్లు కూడ ఖంగారు పడుతున్నట్లు టాక్. 

దీనితో ఇప్పటికే యాభై మిలియన్‌ వ్యూస్‌ రాబట్టుకున్న ‘సామజవరగమన’ పాట కాపీ అంటూ జరుగుతున్న రగడ పై త్రివిక్రమ్ తమన్ లు స్పందిస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. గతంలో కూడ తమన్ మేకింగ్ స్టైల్ పై ఇలాంటి కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను అప్పట్లో తమన్ ఖండించాడు.  

సాధారణంగా టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన పాటలను మూడు నెలలు ముందు విడుదల చేయరు. అయితే త్రివిక్రమ్ తమన్ పై పెట్టుకున్న నమ్మకంతో ఈ మూవీ పాటలు చాల ముందుగా విడుదల చేయడంతో ఈ మూవీ పాటలు ఈ మూవీ విడుదల అయ్యే సమయానికి వినివినీ పాత పాటలుగా మారిపోయే ఆస్కారం కూడ ఉంది అని మరికొందరి అభిప్రాయం. సంక్రాంతికి మహేష్ మూవీతో పోటీ పడుతున్న పరిస్థితులలో ఇలాంటి వ్యూహాన్ని రిస్క్ చేసి త్రివిక్రమ్ చేస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: