టాలీవుడ్ ని తలచుకుంటే గర్వం కలుగుతుంది. అదే టైంలో ఇపుడున్న పరిస్థితిని చూస్తే బాధ ఆవేదన కలుగుతుంది. టాలీవుడ్లో టాప్ స్టార్స్ కొదవలేదు. నటనా సామర్ధ్యం ఉన్న వారు ఎందరో ఉన్నారు. మంచి సినిమాలు అందించే మేటి డైరెక్టర్లు ఉన్నారు. రచయితలు, కోట్లు ఖర్ఛు పెట్టే నిర్మాతలు, వెండితెర‌ను ద్రుశ్య కావ్యంగా చేస్తే కెమెరామ్యాన్స్ .. ఇలా అందరూ ఉన్నారు. కానీ.. 


ఎందుకో టాలీవుడ్ లో సరికొత్త వణుకు మొదలైంది. అది ఇంతకు ముందు లేదు. ఇపుడే అలాంటి భయాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ఒకపుడు తన సినిమా ఎపుడంటే అపుడు టాప్ హీరోలు రిలీజ్ చేసేవారు, వారికి సీజన్లతో పని లేదు. తమ సినిమా ధియేటర్లతో పడితే అదే సీజన్. వారికి సంక్రాంతితో అసలు  పనిలేదు. తమ బొమ్మ తెరమీదకు వస్తే అపుడే సంక్రాంతి అయినా, పెద్ద పండుగ అయినా..  అందుకే అపుడు ఏడాది పొద్దూ సినిమాలు వచ్చేవి. ఒక్కో హీరో అర డజన్ నుంచి డజన్ మూవీస్ చేసేవారు. ఆడియన్స్ కి కూడా మంచి చాయిస్ ఉండేది. అన్ని రకాల జోనర్లలో నాడు సినిమాలు వచ్చేవి. ఇపుడు పరిస్థితి అలా లేదు. ఒక్కో హీరో ఒక్క సినిమావే. అది కూడా ఏడాదికి, రెండేళ్ళకు చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు.


తీరా ఆ సినిమా చీదేస్తే ఇక తడిగుడ్డ వేసుకోవాల్సిందీ.అ దాంతో జనాలను అట్రాక్ట్ చేయడం మానేసి జనాలు అట్రాక్ట్   అయ్యే సీజన్ల మీద ఆశలు పెట్టుకుంటున్నాడు. లేకపోతే అందరి కన్నూ సంక్రాంతి సీజన్ మీద పడడం ఏంటి. సంక్రాంతికి గట్టిగా పది రోజులు కూడా సెలవులు ఉండవు, ఇక అందులో పండుగ మూడు రోజులే జనాలు కొంత రిలీఫ్ గా ఉంటారు. మిగిలినవి అటూ ఇటూ ప్రయాణాలు, ఆ యాతనతోనే గడిచిపోతుంది.


అదేంటో ఆ ఒక్క సీజన్ పట్టుకుని సినిమాలు పోటీ మీద రిలీజ్ చేయలనుకుంటున్నారు. తప్పితే మిగిలిన రోజులు లేవా. మూవీలో దమ్ముండాలి కానీ ఏ సీజన్లో రిలీజ్ చేసినా హిట్ అవుతుంది. మరి అలాంటి టఫ్ టాస్క్ ని ఎందుకు టాలీవుడ్ హీరోలు ఫేస్ చేయలేకపోతున్నారు. ఏదో పండుగ, సీజన్ వస్తేనే హిట్ అని ఎందుకు భావిస్తున్నారు. అసలెందుకు టాలీవుడ్ వణుకుతోంది...? జవాబు వారికి తెలుసు. వారే చెప్పగలరు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: