సౌత్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరోలు అనగా 1980 దశకం నుండి కలిసి పనిచేస్తున్న హీరోలు హీరోయిన్లు ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ అనే క్లబ్ టైటిల్ పేరిట ప్రతియేటా ఒకచోట సమావేశం అవుతూ క‌లుసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్లబ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ లాల్, అర్జున్, జాకీఫ్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, మోహన్ లాల్, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, సుమన్, భాగ్యరాజ్, శరత్ కుమార్, సత్యరాజ్, ఖుష్బూ, నదియా, జయరామ్ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. దీంతో ఈ క్లబ్ లో ఉన్న సభ్యులు మాత్రమే ప్రతి సంవత్సరం ఒక చోట పార్టీని కండక్ట్ చేస్తుంటారు. దీంతో గ్రూపులో ఉన్న ఒక సభ్యుడు స్టార్ హీరో….మిగతా వారందరికీ పార్టీ ఇవ్వాలి. దీంతో ఈ సంవత్సరం పార్టీని చిరంజీవి హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.


ఇటీవల తన ఇంటిని రీ మోడలింగ్ చేయించిన చిరు, వచ్చే నెలలో జరిగే పార్టీకి అందరినీ పిలిచి, గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా తాజాగా జరుగుతున్న పార్టీ  ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పేరిట ఓ క్లబ్ స్థాపించి పది సంవత్సరాలు కావటంతో స్పెషల్ గా చిరంజీవి ఈ పార్టీని కండక్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టడం తో మంచి జోష్ మీద ఉండటంతో భారీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఒకపక్క కెరియర్ పరంగా మంచి జోష్ మీద చిరంజీవి ఉండటంతో తన నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయబోయే సినిమా విషయంలో ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుని స్క్రిప్టు మొత్తం పకడ్బందీగా రెడీ చేసి చాలా తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేయడానికి చిరంజీవి రెడీ అయినట్లు సమాచారం.


దీంతో కొరటాల తో చేయబోయే సినిమా షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ చేసి సమ్మర్ టైం కల్లా కంప్లీట్ చేసి...వేసవిలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. దీంతో ఒకపక్క సైరా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం మరో పక్క ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ క్లబ్ సభ్యులు హాజరుకావడంతో చిరంజీవి ఇంటి లో జరగబోయే పార్టీ భారీ ఎత్తున జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: