గురువారం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ యొక్క డార్క్ సీక్రెట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోమని బిగ్ బాస్ ఆదేశించాడు. అందులో భాగంగా అందరూ తమ లైఫ్ లో జరిగిన రహస్యాలను ఎదుటి వారితో పంచుకున్నారు.  అయితే అందరి సీక్రెట్ విషయాల కంటే  శ్రీముఖి చెప్పిన విషయం ఎక్కువగా ఆకర్షించింది. శ్రీముఖి ఇంతవరకు తన పర్సనల్ లైఫ్ గురించి బయట పెట్టింది లేదు. కానీ మొట్టమొదటి సారిగా ఆమె పర్సనల్  లైఫ్ లోని విషాద సంఘటనని అందరితో పంచుకుంది.


ఆమె ఒకానొక సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పింది. అయితే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనేది మాత్రం చెప్పలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది హింట్ మాత్రం ఇచ్చింది. అతను అందరికీ తెలిసినవాడే అని, అతని పేరును రివీల్ చేయడం ఇష్ట లేదని తెలిపింది. శ్రీముఖి ఒకానొక షో షూట్ చేస్తున్నప్పుడు అతని గురించి తెలిసిన విషయం తనని చాలా బాధపెట్టిందట. ఆ షో మొత్తం ఏడుస్తూనే ఉందట. ఆ తర్వాత తను ఆ రిలేషన్ ని బ్రేక్ చేసుకుందని చెప్పింది.


తన జీవితంలో జరిగిన ఆ బ్రేకప్ తనకి చాలా నేర్పిందట. ఒకానొక స్థాయి వచ్చేవరకు ప్రేమ లాంటివేమీ పెట్టుకోకూడదని, అనవసరంగా జీవితాలని పాడుచేసుకోవద్దని హితబోధ చేసింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది. ఆమె రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి అందరికీ తెలిసిన వాడే అని చెప్పడంతో జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. 


శ్రీముఖి ఎక్కువగా యాంకరింగ్ వల్లనే ఫేమస్ అయింది కాబట్టి ఆ అజ్ఞాత వ్యక్తి కూడా యాంకర్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది.లేదంటే సినిమా పరిశ్రమకి చెందిన వాడైనా ఉండాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా శ్రీముఖి లవ్ రిలేషన్ షిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: