తెలుగు ఇండస్ట్రీలోకి పునర్నవి భూపాలం.. రాజ్ తరుణ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన  ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా క్యూట్ క్యూట్‌గా అదరగొట్టి ఇండస్ట్రీలో రావడం జరిగింది. ఆ తర్వాత పునర్నవి కొన్ని సినిమాలలో నటించింది, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించి మంచి నటనతో  అందరితో మంచి గుర్తింపు లభించుకుంది. అంతేకాకుండా.. అప్పటిలో  ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడా చేయడం జరిగింది. మొత్తానికి పునర్నవి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది పున్ను.


 ఇటీవల బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్కొని పున్ను.. అక్కడ కూడా బాగా అదరగొడుతూ.. హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌ అని పేరు కూడా తెచ్చుకుంది. అంతే కాకుండా.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌజ్ ప్రేమ జంటగా  చాలా పాపులర్ కూడా అయ్యింది అని చెప్పాలి.


ఇక  మూడు వారాల ముందే హౌజ్ నుండే ఎలిమినేట్ అయిన పునర్నవి తన సక్సెస్‌ను బాగా ఆనందంగా సెలెబ్రెట్ చేయుకుంటుంది. అందులో భాగంలో తన తమ్ముడు, ఫ్రెండ్స్‌తో సెలెబ్రేట్ చేసుకుంటున్నా.. కొన్ని ఫోటోస్‌‌ను తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం జరిగింది. ఇటీవల  పున్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ కూడా చేయడం జరిగింది.


 ఈ పోస్ట్‌లో.. ఎమోషన్‌గా రాస్తూ.. ఈ జీవితం తనకు చాలా ఇచ్చిందని.. చాలా హ్యపీ అంటూ.. కృతజ్ఞతలు తెలియచేసింది. అంతేకాకుండా బీచ్‌లో ఏకాంతంగా కూర్చోని.. బ్లూ డ్రెస్‌లో ఉన్న ఫోటోను కూడా  షేర్ చేయడం జరిగింది. కాగా పునర్నవి ప్రస్తుతం 'సైకిల్', 'చిన్న విరామం' సినిమాల్లో నటిస్తుంది అని తెలియచేసింది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో సినిమా చేయడానికి అవకాశం కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: