రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఎరుగని సినీలోకం లేదు.అలాంటి వర్మ ఎవరి మీద నైనా ఇట్టే కామెంట్స్ చేస్తుంటారు అలాగే ఫేమస్ అయిపోతుంటారు.పవన్ కళ్యాణ్ మీద ఇదివరికి కామెంట్స్ చేసినా అప్పుడు అలా అలా ఆ కామెంట్స్,వాటి తాలూకు యాక్షన్స్, రియాక్షన్స్ అన్ని కూడా సమసి పోయ్యాయి.ఇప్పుడు మళ్లీ  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసాడు.


‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాజకీయాన్ని చాలా సహజ సిద్ధ నాటకీయంగా మార్చిన వర్మ ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమా రెడీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కులాల మీద సాంగ్ రిలీజ్ చేసి పెద్ద విధ్వంసం సృష్టించాడు.రామ్ గోపాల్ వర్మ.ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రతో పాటు చంద్రబాబు నాయుడు సంబంధించిన గెటప్‌ను రిలీజ్ చేసి శభాష్ అని పించుకున్న వర్మ. 


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ రిలీజ్ చేసాడు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర చేస్తున్న క్యారెక్టర్  ఒక రాజకీయ సభలో ఫారెన్ డాన్సర్లతో ఉన్నట్టుగా రెడీ చేసి రిలేజ్ చేసాడు. అంతేకాదు ఈ పోస్టర్‌ను ఎవరినైనా పోలీ ఉంటే అది పూర్తిగా  కో ఇన్సిడెంట్ అని ట్వీట్ చేసాడు. మరోవైపు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌ను దీపావళి కానుకగా ఆదివారం ఉదయం 9.36 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలియపరిచారు.. ఫైనల్ గా  తన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను మరోసారి వార్తల్లో ఎక్కించి ఫాన్స్ అందరికి ఒక మంచి ట్రీట్ ఇచ్చినట్టు అర్థం అవుతుంది.


ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తన ట్విట్ కి ఘాటుగా స్పందించినట్టు అర్థం అవుతుంది.ఏదేమైనా ఇలా రాజకీయాల గురుంచి తీస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ ని సృష్టిస్తున్న రాం గోపాల్ వర్మ ది పిచ్చనో పిచ్చ క్లారిటినో అర్థం కాక జనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: