ఇప్పటికే దాదాపుగా చివరి అంకానికి చేరుకున్న క్రేజీ షో బిగ్ బాస్. కొద్దిరోజులుగా మంచి క్రేజ్ గా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై ఆడియన్స్ ఇప్పటికే ఎంతో ఆశగా ఎదురు చూస్తన్నారు. మొదటి రెండు సీజన్స్ కు ఎన్టీఆర్ మరియు నాని తమ ఆకట్టుకునే హోస్టింగ్ ట్యాలెంట్ తో అదరగొట్టగా, ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఈ మూడవ సీజన్ ని, కింగ్ నాగార్జున కూడా మంచి జోష్ తో ముందుకు తీసుకెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే షో లో మొత్తం ఆరుగురు హౌస్ మేట్స్ మాత్రమే మిగలగా, వారిలో రాహుల్ మాత్రం సేఫ్ గా ఫైనల్ కి చేరనున్నారు. 

దానితో ఎలిమినేషన్ జోన్ లో మొత్తం ఐదుగురు మిగులుతారు. సో వారిలో ఈవారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారు అనే దానిపై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ వారం కూడా బయటకు వచ్చిన బిగ్ బాస్ లీక్స్ ప్రకారం, ఈ వారం ఎక్కువ శాతం ఎలిమినేట్ అయ్యేది వి6 న్యూస్ యాంకర్ శివ జ్యోతి అని అంటున్నారు. వాస్తవానికి మొన్నటివరకు బాబా భాస్కర్, ఆలీ, వరుణ్ సందేశ్, శ్రీముఖి లతో పాటు శివ జ్యోతికి కూడా మంచి ఓటింగ్ లభించిందని, అయితే నేటి ఉదయం నుండి అనూహ్యంగా మిగతా వారితో పోలిస్తే ఆమెకు చాలా తక్కువ స్థాయిలో ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. 

ఇక ఆమెకు వస్తున్న ఈ ఓటింగ్ పరిస్థితి మరొక రెండు రోజుల వరకు ఇలాగే కొనసాగేలా కనపడుతోందని, సో దీనిని బట్టి ఈ వారం షో నుండి పక్కాగా బయటకు వెళ్ళేది శివ జ్యోతినే అని అంటున్నారు. అయితే దీనిపై శివ జ్యోతి ఫాలోవర్స్ మాత్రం సోషల్ మీడియాలో మండిపడుతూ, ఇదంతా ఒట్టి బూటకమని, ఇవాళ ఓటింగ్ తగ్గినంత మాత్రాన మిగతా రెండు రోజులు కూడా తగ్గుతుందనే ముందే చెప్పలేమని, కాబట్టి చివరి క్షణం వరకు ఆగితేనే గాని హౌస్ నుండి ఎవరు బయటకు వస్తారో చెప్పలేమని ఈ వార్తలకు కొట్టిపారేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి అవుట్ అవుతారో తెలియాలంటే మరొక్క రెండు రోజలు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: