ఒకరు భరత్ అను నేను మూవీలో ముఖ్యమంత్రి. మరొకరు నిజజీవితంలో ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి సతీమణులు కలుసుకున్న అరుదైన సంఘటన ఈ రోజు జరిగింది. విజయవాడకు ఈ రోజు వచ్చిన మహేష్ సతీమణి నమ్రత తాడేపల్లిలోని జగన్ నివాసంలో  మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించాక టాలీవుడ్ నుంచి వచ్చిన రెండవ ప్రముఖురాలు ఆమె. ఇంతకు ముందు చిరంజీవి కూడా జగన్ ఇంటికి వచ్చిన సంగతి విధితమే.


ఇదిలా ఉండగా భారతిని కలసిన నమ్రత  తాను గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ అభివ్రుధ్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతిని వివరించారు. ఆయా పనులను మరింతగా అభివ్రుధ్ధి చేసేందుకు  ఇందుకోసం ప్రభుత్వ సాయం కావాలని భారతిని నమ్రత  కోరినట్లుగా తెలుస్తోంది.  తన ఇంటికి వచ్చిన నమ్రతను సాదరంగా ఆహ్వానించిన భారతి ఆమె చెప్పినదంతా విన్నట్లుగా సమాచారం.  సూపర్ స్టార్ క్రిష్ణ వైఎస్సార్ కి అభిమాని, ఇక జగన్ కి కూడా ఆయన అభిమాని. జగన్ సైతం క్రిష్ణ ఇంటికి ఆ మధ్యన వెళ్ళారు. ఆయన సతీమణీ విజయనిర్మల చనిపోవడంతో పరామర్శించారు.


ఇపుడు నమ్రత జగన్ ఇంటికి రావడం ద్వారా సూపర్ స్టార్ కుటుంబం వైఎస్ ఫ్యామిలీల మధ్య  ఉన్న ఆ అనుబంధం కొనసాగుతోందని చెప్పాలి. ఇక మహేష్ బాబు బావ అయిన గల్ల జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. మరో వైపు చిన్నాన్న ఆదిశేషగిరిరావు సైతం వైసీపీలో ఉంటూ టీడీపీ వైపుగా వచ్చేశారు. ఇపుడు నమ్రత  రావడం వెనక మరోమారు క్రిష్ణ కుటుంబం వైసీపీ వైపుగా జరుగుతుందా అన్న చర్చ సాగుతోంది. మరి మహేష్ బాబు కూడా జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: