కోలీవుడ్ లో విజయ్ హీరోగా  తెరీ, మెర్స‌ల్ త‌ర్వాత వస్తున్నా  బిగిల్ సినిమా పై చాల అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.  ఎందుకంటే  ఒలంపిక్స్ నేప‌థ్యం ఉన్న కథలో విజయ్.. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, రౌడీగా, నాయకుడిగా ఇలా 3 పాత్రల్లో కనిపిస్తున్నాడు. విజయ్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా 'బిగిల్' సినిమాని తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల చేస్తున్నారు.

లేడి సూపర్ స్టార్  నయనతార విజయ్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. దానికి తగ్గట్టే  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కళ్లు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్‌తో అదిరిపోయింది మొన్న విడుదలైన ట్రైలర్. ఈ సినిమాకు మ్యూజిక్ కింగ్  ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. విజయ్, నయన్‌తో పాటు మిగితా పాత్రల్లో.. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ఈ న‌టిస్తున్నారు.


 ఇక విజయ్ నటించిన.. అదిరింది, స‌ర్కార్ సినిమాల త‌ర్వాత తెలుగులో విజ‌య్ మార్కెట్ బాగానే పెరిగింది. మరి ఈ ‘విజిల్’తో విజయ్ తెలుగులో మరోసారి బాక్సాఫీస్ దగ్గర విజిల్ వేస్తాడా లేదా అనేది చూడాలి.ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవైయుంది. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ సినిమాను అల్రేడి చూసిన ఓవర్సీస్ ప్రేక్షకుల సినిమా గురించి ఏమంటున్నారు.

అట్లీ  ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా.. అసలు కథేంటీ.. విజయ్‌కు మరో సారి బ్లాక్ బస్టర్ దొరికిందా.. అసలు ఓవర్సీస్ ప్రేక్షకులు సినిమా గురించి ట్విట్టర్ లో రివ్యూ లు పెడుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాతో ఎమోషన్ బాగా పండిందని...ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో ఫుడ్ బాల్ సీన్స్ అదరగొట్టారని అంటున్నారు.మొత్తంగా చూస్తే ఈ సారి విజయ్ గోల్ కి విజిల్ బాగా మోగింది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: