యాంకర్ రవి సోషల్ మీడియాలో రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. ఈ మధ్య పాపం  అలాంటివేమి లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు.. చేసుకుంటూ పోతున్నాడు.  కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. మన రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అన్నట్లున్నాయంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. సందట్లో సడేమియా అని మొన్న దసరా పండక్కి ఈటీవీ ప్రోగ్రామ్‌లో తన ప్రేమ, పెళ్లి గురించి కూడా మీడియా ముందు చెప్పాడు. అదే కార్యక్రమంలో యాంకర్ లాస్యతో ఉన్న రిలేషన్‌పై కూడా మాట్లాడాడు. 


ఇక ఆ తరువాత  ఎలాంటి టెన్షన్స్ లేకుండా కూల్ గా  పటాస్ అంటూ ఫుల్ పటాస్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నాడు రవి.  ఏ రూమర్స్ లేకపోతె జనం తనని ఎక్కడ మర్చిపోతారో అనుకున్నాడో ఏమో .....ఉన్నట్టుండి  కొందర్ని హౌలేగాళ్లు అంటూ పోస్ట్ పెట్టి కూర్చున్నాడు. విషయం ఏంటంటే..ఓ ఫేమస్ పర్సన్‌తో తాను కొంతకాలం ప్రేమలో ఉన్నానని..  శ్రీముఖి బిగ్ బాస్ షోలో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పింది. తరువాత అతడు తనను మోసం చేసాడని...  అందుకే అంతనితో బ్రేకప్ చేసుకున్నానని చెప్పింది. ఇంకేముంది ఆ మోసం చేసింది యాంకర్ రవి అంటూ సోషల్ మీడియాలో గుప్పుమంది.


 ఎందుకంటే వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో రవి, శ్రీముఖి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు చాలా కాలంగా వినిపించాయి. ఉన్నట్లుండి పటాస్ నుంచి శ్రీముఖి బయటికి వెళ్లిపోవడం.. ఆ తర్వాత కనీసం రవి గురించి ఎక్కడా మాట్లాడకపోవడం జరిగింది. ఇదంతా గతం అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు శ్రీముఖి చెప్పిన లవ్ స్టోరీ మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. సరిగా అదే టైం కి  రవి ఇదిగో ఇలా పోస్ట్ పెట్టాడు.


నా లైఫ్ ఫిలాసఫీ చాలా సింపుల్.. లో లివింగ్.. హై థింకింగ్.. కష్టపడాలే.. బాగా డబ్బు సంపాదించుకోవాలా.. ఫైనల్‌గా హౌలేగాళ్లను దూరం పెట్టాలే అంటూ పోస్ట్ పెట్టాడు. మనోడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన చెప్పిన ఆ హౌలే గాళ్లు ఎవరంటూ చర్చలు జరుగుతున్నాయి. ఈయన మీడియాను ఉద్దేశించి పెట్టాడా.. లేదంటే యాంకర్ శ్రీముఖి వర్గాన్ని టార్గెట్ చేసాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మరోసారి రవి వార్తల్లో నిలిచాడు. మరి ఇదెక్కడా ఆగుతుందో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: