బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియ మీద మరోసారి డౌట్లు రేజ్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3, 15 మంది కంటెస్టంట్స్ తో మొదలవగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి సర్ ప్రైజ్ చేశారు. అయితే ప్రస్తుతం చివరి వారంలో ఉన్న కంటెస్టంట్స్ చూస్తే విన్నర్ ఎవరన్నది చెప్పడం కాస్త కష్టమే అన్నట్టుగా ఉంది.


ఇప్పటికే రాహుల్ ఫైనల్ వీక్ లోకి వెళ్లాడు.. శుక్రవారం ఎపిసోడ్ లో బాబా భాస్కర్ కూడా ఫైనల్స్ కు వెళ్లాడు. ఇక మిగిలిన నలుగురిలో ముగ్గురు ఫైనల్స్ కు వస్తారు. దాదాపు ఈ వారం శివ జ్యోతి ఇంటి దారి పట్టక తప్పదని అంటున్నారు. అయితే బిగ్ బాస్ లో ఈ సీజన్ కు వచ్చిన టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎవరంటే శ్రీముఖి, వరుణ్ సందేష్ అని చెప్పొచ్చు. యాంకర్ గా శ్రీముఖికి బయట సూపర్ ఫాలోయింగ్ ఉంది.


వరుణ్ కూడా హీరోగా మంచి సినిమాలు చేశాడు కాబట్టి అతనికి మంచి పాపులారిటీ ఉంది. ఇప్పటివరకు నామినేషన్స్ లో ఉన్నా ఓటింగ్స్ ద్వారా సేవ్ అయ్యారు. అయితే ఇప్పుడు టైటిల్ విన్నర్ కావాలంటే కేవలం ఓటింగ్ మాత్రమే కాదు బిగ్ బాస్ కూడా ఆమోదముద్ర వేయాలని తెలుస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకుల చేతుల్లోనే టైటిల్ విన్నర్ ఎవరన్నది ఉంటుంది. వారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఓటింగ్స్ ఎలా వచ్చినా వారు అనుకున్న వారికే టైటిల్ ఇస్తారని అంటున్నారు.  


ముఖ్యంగా శ్రీముఖికి బిగ్ బాస్ టీం సపోర్ట్ చాలా ఉందని ఇన్నర్ టాక్. శ్రీముఖినే ఈ సీజన్ విన్నర్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. శ్రీముఖి కాకుంటే రాహుల్, వరుణ్ ల మధ్య పోటీ ఉంటుంది. ఒకరికి ఇస్తే మరొకరి ఫ్యాన్స్ ఊరుకోరు. అందుకే ఇద్దరికి కాకుండా శ్రీముఖికి ఇస్తాడని తెలుస్తుంది. మరి ఫైనల్ విన్నర్ ఎవరన్నది తెలియాలంటే మరో వారం వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: