ఈషా రెబ్బ తెలుగు నటిగా మంచి పేరు సంపాదించింది .తన మొదటి చిత్రం "అంతకు ముందు ఆ తర్వాత " తో మంచి నటిగా పేరుపొందింది.కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆమెకు ఛాన్స్ రాలేదు అనే చెప్పాలి .ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో సైడ్ హీరోయిన్ గ పని చేసింది కానీ ఆ సినిమా కూడా ఈ అమ్మడికి అనుకున్న క్రేజ్ రాలేదు .


ఇపుడు ఈషా రెబ్బ తన కెరీర్లో తొలిసారి రాగల 24 గంటల్లో అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా విడుదలైన స్టిల్ లో సంప్రదాయమైన లుక్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు ఈషా రెబ్బా. కెరీర్ లోనే ఇషా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల నుంచి ఈమెకు అద్భుతమైన స్పందన వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. 


సినిమా లో ఎలా ఉన్న ట్విట్టర్ లో మాత్రం ఈ భామ కి ఫాలోయింగ్ మాములుగా లేదు. ట్విట్టర్ లో తరుచు ఫోటోషూట్స్ చేస్తూ తన ఫొటోస్ మరియు తాను చేసే సినిమా అప్డేట్ లు  బాగానే ఇస్తూ ఉంటుంది ఈ భామ. ఈ మధ్య ఈ అమ్మడు ట్విట్టర్ లో తన ఫొటోస్ లో అందాల ఆరబోత తో కుర్రాళ్ల గుండెల్లో నిద్ర లేకుండా చేస్తుంది .ఎవరు అయినా ప్రొడ్యూసర్స్ ఈ అమ్మడు అందం ఇంకా నటన చూసి ఛాన్స్ లు ఇవ్వాలని అని కామెంట్ లు పెడుతూ ఉంటారు  .



మరింత సమాచారం తెలుసుకోండి: