రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ లేటెస్ట్ గా ఇస్తున్న షాక్ లతో సతమతమవుతున్న పవన్ అభిమానులకు పవన్ కళ్యాణ్ చైనా యుద్ధం పై పడుతున్న సెటైర్లు మరింత గందరగోళంలో పడేస్తున్నాయి. పవన్ ఎన్నికలలో ఓడిపోయినా అతడి పై నెగిటివ్ ప్రచారం చేసేవారి సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడంతో పవన్ కొద్దిరోజుల క్రితం నెల్లూరులో చేసిన ప్రసంగం పై ఇప్పుడు సెటైర్లు ఊపందుకున్నాయి. 

ఆమధ్య పవన్ నెల్లూరులో తన జనసైనికులతో మాట్లాడుతూ తన చిన్నతనంలో చైనా యుద్ధం సమయంలో భారత భూభాగాలను చైనా ఆక్రమించుకుంది అని తెలుసుకుని తాను ఆవేదనకు గురయ్యానని ఆ మానసిక సంఘర్షణ నుండి ‘జనసేన’ పార్టీ పుట్టిందని వివరించాడు. దీనితో పవన్ చిన్నతనంలో చైనా యుద్ధం ఎక్కడ జరిగింది అంటూ సెటైర్లు ఊపందుకున్నాయి.

చైనా యుద్ధం 1962 సంవత్సరంలో జరిగింది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971 సంవత్సరంలో. అలాంటిది పవన్ కళ్యాణ్ చిన్నతనంలో చైనా యుద్ధం జరిగింది అంటూ కొందరు వింత ప్రశ్నలు వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చైనా యుద్ధం గురించి తన చిన్నతనంలో పుస్తకాలలో చదివిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుని ఇలా ఉద్వేగంతో మాట్లాడి ఉంటాడు. 

పవన్ మాట్లాడటంలో ఒక పదం తేడా రావడంతో తన చిన్నతనంలో చైనా యుద్ధం గురించి చదివాను అని చెప్పబోయి చైనా యుద్ధం తన చిన్నతనంలో జరిగింది అని మాట్లాడి ఉంటాడు. ఒక పదం పొరపాటును ఆసరాగా తీసుకుని ఇప్పుడు పవన్ పై సెటైర్లు పడటం చూస్తుంటే అతడి పై ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో అందరికీ అర్ధం అవుతుంది. లక్ష పుస్తకాలు చదివాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ బహిరంగ సమావేశంలో మాట్లాడేడప్పుడు కొద్దిగా హోమ్ వర్క్ చేసుకుని మైక్ ముందుకు వస్తే బాగుంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: