మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 మూవీ సైరా హిస్టారికల్ జోనర్ లో తీశారు. ఈ మూవీ గాంధీ జయంతి రోజు రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన సైరా నరిసింహారెడ్డి రాయలసీమకు చెందిన  స్వాతంత్ర పోరాట యోధుడి వీర గాధ. ఈ సినిమా రిలీజ్ అయి అపుడే పాతిక రోజులు గడచిపోయాయి. ఇపుడున్న పరిస్థితుల్లో ఇన్ని రోజులు అంటే ఆ ఫ్లావర్ పోయినట్లే. ఇక చాలా ధియేటర్లలో కూడా  సైరా మూవీని తీసేస్తున్నారు.


ఈ టైంలో సైరా మూవీ ని జగన్ చూస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవౌతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళ్  సై ఈ మూవీని చూశారు. ఈ నెల 14న మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిలోని జగన్ ఇటికి తన సతీమణి సురేఖతో సహా వచ్చారు. అక్కడ ఆయనకు మంచి ఆతీధ్యం జగన్ ఇచ్చారు. ఇక ఈ మూవీ చూడమని జగన్ని చిరంజీవి కోరారు.


అయితే జగన్ ఒకే అన్నా కూడా ఇప్పటికి మరో పదిహేను రోజులు గడచిపోయాయి. ఇపుడు దీపావళి, ఇతర పండుగ‌లు వచ్చేశాయి. సైరా హుషార్ కూడా తగ్గిపోయింది. ఈ టైంలో జగన్ చూస్తారా, చూసినా సైరా టీం అనుకుంటున్నట్లుగా హైప్ వస్తుందా అన్నది పెద్ద డౌట్. నిజానికి సినిమా చూడాలంటే తొలివారంలోనే చూడాలి.


నాలుగవ వారం తరువాత మూవీ చూసినా చూడకపోయినా కలసివచ్చేది ఏదీ లేదు. మొత్తం మీద చూసుకుంటే సైరా మూవీ విషయంలో జగన్ చూస్తారా చూడారా. ఆయన్ని మళ్ళీ  చిత్ర యూనిట్ సంప్రధించి ప్రత్యేక ప్రదర్శన వేసేందుకు అనుమతి అడుగుతుందా అన్నది కూడా ఎక్కడా తెలియడంలేదు మరి. మరో వైపు చూసుకుంటే పవన్ రాజకీయ వేడిని పెంచేశారు. జగన్ మీద విసుర్లు, విమర్శలు హై రేంజిలో చేస్తున్నారు. ఇది కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: