ఆనంద్ దేవరకొండ నటించిన తొలిసినిమా ‘దొరసాని’ ఫెయిల్ అయినా అతడిని హీరోగా నిలపెట్టాలని విజయ్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. తన తమ్ముడుకి మంచి హిట్ ఇవ్వగల కథల కోసం అదేవిధంగా మంచి దర్శకుల కోసం విజయ్ ఆన్వేషణ కొనసాగుతూనే ఉంది అని టాక్. 

అయితే విజయ్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుతం అతడు నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ను హీరోగా చేసి నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సక్సస్ పై ఆధారపడి ఉంది అని అంటున్నారు. డిఫరెంట్ కథతో నిర్మాణం జరుపుకున్న ఈమూవీ ఎలాంటి పోటీ లేకుండా వచ్చేవారం దీపావళి హడావిడి పూర్తి అయిన తరువాత విడుదల కాబోతోంది. 

ఈమూవీకి పోటీగా ఏ సినిమాలు విడుదలకాని పరిస్థితులలో ఈమూవీకి కనీసపు పాజిటివ్ టాక్ వచ్చినా ఈమూవీ సక్సస్ కావడం ఖాయం అని అంటున్నారు. అదే జరిగితే తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా భవిష్యత్ లో చాల చిన్న సినిమాలు తీయాలని విజయ్ ఆలోచన అని అంటున్నారు. 

ముఖ్యంగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా నిలబెట్టడానికి అవసరం అనుకుంటే రెండు మూడు సినిమాలు తన సొంత బ్యానర్ పై నిర్మించే ఆలోచనలలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అంతా ‘మీకు మాత్రమే చెప్తా’ విజయం పై ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. దీనితో ఈమూవీ సక్సస్ ఆనంద్ దేవరకొండ కెరియర్ కు కూడ కీలకంగా మారింది అని అనుకోవాలి. ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ షాక్ లో ఉన్న విజయ్ కు నిర్మాతగా అతడు చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఈపరిస్థితులు ఇలా ఉంటే ఈ మూవీ విడుదల కాకుండానే ఒక ప్రముఖ ఛానల్ విజయ్ టేస్ట్ ను నమ్ముకుని ‘మీకు మాత్రమే చెప్తాను’ 2 కోట్లకు శాటిలైట్ రైట్స్ కొన్నది అని వస్తున్న వార్తలు విజయ్ మ్యానియాను సూచిస్తున్నాయి..
 



మరింత సమాచారం తెలుసుకోండి: