ఫైర్ బ్రాండ్ సెలెబ్రెటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న హేమ శ్రీముఖిని టార్గెట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ‘బిగ్ బాస్’ షో విన్నర్ గేటు వరకు వచ్చిన శ్రీముఖిని దెబ్బ తీస్తాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. హేమ ఆమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ‘బిగ్ బాస్’ షో నుంచి కేవలం ఒక వారంలో ఎలిమినేట్ కావడానికి శ్రీముఖి అనుసరించిన రాజకీయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

అంతేకాదు ఈ షో విన్నర్ కావాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్న శ్రీముఖి తాను ‘బిగ్ బాస్’ షోలో కొనసాగితే తన అవకాశాలు దెబ్బతింటాయి అన్న ఉద్దేశ్యంతో అందర్నీ తనకు శత్రువులుగా శతృవులుగా మార్చిందని హేమ అభిప్రాయ పడుతోంది. తాను ‘బిగ్ బాస్’ షో నుండి బయటకు వచ్చాక ఈ షో నుండి హిమజ ఎలిమినేట్ అయ్యే వరకు చూశానని ఇప్పుడు తాను ‘బిగ్ బాస్’ షోను చూడటం మానేశాను అంటూ కామెంట్ చేసింది.

ఇది ఇలా ఉండగా నిన్న ప్రసారం అయిన కార్యక్రమంలో బుల్లితెర ప్రేక్షకులకు షాక్ ఇస్తూ ‘బిగ్ బాస్’ ముందుగా బాబా భాస్కర్ ను సేఫ్ చేసి గ్రాండ్ ఫైనల్స్ లోకి పంపడం షాకింగ్ గా మారింది. దీనితో శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు బాబా భాస్కర్ కు పడ్డాయా అన్న సందేహాలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈ వారంతం షోలో ఎలిమినేట్ అయ్యే వ్యక్తులలో శివజ్యోతికి ఎక్కువ ఆస్కారం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో టాప్ ఫైనల్ రేస్ కు శివజ్యోతి దూరం అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్’ విన్నర్ ఎంపిక చేసే ప్రక్రియ క్లైమాక్స్ కు చేరుకున్న దశలో హేమ శ్రీముఖిని టార్గెట్ చేయడంతో ఆమెకు ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల పడేఓట్లు తగ్గి పరోక్షంగా బాబా భాస్కర్ కు ఉపకారం జరుగుతుంది అంటూ కొన్ని మీడియా సంస్థలు ఊహాగానాలు చేస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: