బిగ్ బాస్ సీజన్ 3లో ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఇంటి సభ్యులు ఆరుగురిలో రాహుల్, బాబా భాస్కర్ ఇద్దరు ఫైనల్ వీక్ టాప్ 5లో స్థానం సంపాదించుకున్నారు. ఇక మిగిలిన ముగ్గురు ఎవరన్నది ఇప్పుడు పెద్ద టాస్క్ అయ్యింది. మిగిలిన వారిలో అలి రెజా, శ్రీముఖి, వరుణ్ సందేష్, శివ జ్యోతి ఉన్నారు. 


అయితే శ్రీముఖి, వరుణ్ లు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ కాబట్టి ఈ రోజు వాళ్లిద్దరిలో ఒకరిని సేఫ్ చేసే అవకాశం ఉంది. ఇక శివ జ్యోతి, అలి రెజాలలో ఒకరు ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్తారని తెలుస్తుంది. శివ జ్యోతి కన్నా అలి రెజానే స్ట్రాంగ్ కంటెస్టంట్ కాని అలి మధ్యలో ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్లీ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చాడు. 


అందుకే ఈ వారం శివ జ్యోతి బదులుగా అలి రెజాని ఇంటి నుండి బయటకు పంపించేస్తారని తెలుస్తుంది. 50 రోజుల తర్వాత ఎలిమినేట్ అయిన అలి రెజా మళ్లీ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చాడు. అయితే అతనికి పేమెంట్ మాత్రం ఆ 50 రోజులకు మాత్రమే ఇస్తారట. అలితో అలా చెప్పే హౌజ్ లోకి పంపించారట. అలి కూడా వచ్చిన ఆఫర్ ఎందుకు కాదనడం హౌజ్ లో ఉండి ఫ్యాన్స్ ను ఏర్పరచుకోవచ్చని వైల్డ్ కార్డ్ గా ఫ్రీగా వచ్చాడట.


అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ రేసులో ముగ్గురు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. వరుణ్, శ్రీముఖి, రాహుల్ ఈ ముగ్గురు టాప్ లో ఉన్నారు. రాహుల్ కు బయట ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్ల అతనే ఫైనల్ విన్నర్ అంటున్నారు. అయితే శ్రీముఖికి స్మాల్ స్క్రీన్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆమెను విన్నర్ గా చేసే అవకాశాలు ఉన్నాయట.     


మరింత సమాచారం తెలుసుకోండి: