తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల కొరత చూసిన మెగా ఫ్యామిలీ తన ఇంట్లో పుట్టిన వారసులందరిని కళామాతల్లి కి ఇచ్చేసింది. ఈ మధ్య హీరోలు అవడానికే మెగాఫ్యామిలీ లో చేరుతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన ఈ జనరేషన్‌ యంగ్ హీరో., చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్‌ గత ఏడాది ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో కాస్త పర్వాలేదనిపించుకున్న కళ్యాణ్ సినిమాల ఎంపికలో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నాడు.


కొంత గ్యాప్‌ తరువాత ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్‌ కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు కళ్యాణ్. పులి వాసు దర్శకత్వంతో తెరకెక్కుతున్న వీరి సినిమాకు సూపర్ మచ్చి అనే టైటిల్‌ను పెట్టారు. దీపావళి కానుకగా టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. జోరు వర్షంలో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్న కళ్యాన్ లుక్‌ ఆదిరింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి హీరోయిన్. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రియా చక్రవర్తి తరువాత బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. 


ఏడేళ్ల తరువాత మళ్లీ ఈ సినిమాతో రియా తెలుగులోకి రీ ఎంట్రీ అవుతుంది. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ వీకే, పోసాని కృష్ణమురళిలతో పాటు అజయ్‌, ప్రగతి, మహేష్‌, షరీఫ్, సత్యలు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని, శ్యామ్‌ కే నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ప్రస్తుతం రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ లో మనకి బాగా ఇష్టమైన శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'తిప్పరా మీసం' సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: