సినీ ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ., గ్లామర్ మాత్రం ముఖ్యం.. ఇప్పుడు ఇలాంటి గ్లామర్ గర్ల్ ఒకరు బాలీవుడ్ని కుదిపేస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, సీరియల్స్‌లో నటిస్తూ  ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూతారియా 23 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టేసింది. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా కూడా సుతారియా అందానికి, గ్లామర్‌కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో విడుదల కానున్న ‘మర్జావా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ తారా మూగ యువతి పాత్రలో కనిపిస్తుందట.


మామూలుగానే తన ఫ్యాషన్, స్టయిల్స్ తో యువతను ఆకట్టుకున్న ఈ తారా ఈ మధ్య తరచూ పార్టీలు, ఈవెంట్లలో తళుక్కు మంటుంది. ఈ వేడుకలకు ఆమె వేసుకొచ్చే దుస్తులు అందరి దృష్టిని తన వైపుకి లాగేస్తున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ జరుపుకున్న 46వ బర్త్‌డే పార్టీకి హాజరయిన సుతారియా వేసుకున్న క్రాప్ టాప్ చూస్తే మతిపోవాల్సిందే. కేవలం రొమ్ములు మాత్రమే కవర్ చేసే ఈ టాప్ ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. ఇటీవల గోవా బ్యూటీ ఇలియానా కూడా తన సినిమా ప్రమోషన్స్ భాగంగా ఇలాంటి టాప్‌లోనే కనిపించింది. అది చూసిన అందరూ ఇలియానా ఫ్యాషన్‌ని ఫాలో అయిపోతున్నారని తెలుస్తోంది.


సుతారియా ఇన్‌స్టాగ్రామ్‌కు 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు విపరీతమైన స్పందన వస్తుంది. ఇక అబ్బాయిలైతే ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగేస్తున్నారు. ఇక అమ్మాయిలైతే మీలాగా అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో చిట్కాలను అడుగుతున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో తారలు చేసే సినిమాలను బట్టి ఫాలోయింగ్ పెరుగుతూ ఉండేది.

కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. సినిమాలు చేసినా చేయకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా, నటన వచ్చిన రాకపోయినా వారి ఫిగర్‌, అందానికి పడిపోయే ఫాలోవర్సే ఎక్కువ మంది ఉన్నారు. జాక్వెలీన్ ఫెర్నాండెజ్, దిషా పటానీ, తారా సుతారియానే ఇందుకు ఉదాహరణ...


మరింత సమాచారం తెలుసుకోండి: