యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో గత ఏడాది రిలీజ్ అయిన జై సింహ సినిమా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు మరియి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు మాత్రం అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో పూర్తి విఫలం అయ్యాయి. అనంతరం కొంత ఆలోచనలో పడ్డ బాలకృష్ణ గారు, 

గతంలో తనకు జైసింహా తో సక్సెస్ ని అందించిన కేఎస్ రవికుమార్ గారికే మళ్ళి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక వీరి కాంబినేషన్లో ప్రారంభమైన తాజా సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే దీపావళి పండుగను పురస్కరించుకుని నేడు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కాగా ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ని నిర్ణయించి, ఆ సినిమాలో ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు. 

ఇక ఆ పోస్టర్ లో బాలకృష్ణ గారు పోలీస్ గెటప్ లో ఒక పెద్ద సుత్తి పట్టుకుని ఉగ్రరూపంతో ఉన్న లుక్ ని చూడవచ్చు. దీనిని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నట్లు అర్ధం అవుతోంది. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: